భారతీయులు ఆవుని గోమాతల పూజిస్తారు. ఆవు పంచకంతో కొందరు ఇంటిని శుద్ధి చేస్తారు. కొందరు పొద్దున్నే లేవంగనే గోవు పంచకం తాగుతరు. మరికొందరు కొన్ని రోగాలకు మందుల తయారీలో ఆవు మూత్రాన్ని వాడుతరు. ఇక ఆవు పెండతో ఇప్పటికీ ఊళ్లల్లో వాకిట్లో సామిడి (కళ్లాపి) చల్లుతరు. ట్రెడిషనల్‌గా ఆవు మూత్రం, పెండకు అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఎప్పటి నుంచో గట్టి నమ్మకం ఉండటం వల్లే వీటిని తరతరాలుగా వాడుతూ వస్తున్నారు.
గోమూత్రం, పెండలోని ఔషధ గుణాలను తెలియజెప్పేందుకు సైంటిఫిక్ గా రీసెర్చ్‌లు జరగలేదు. అందుకే.. దేశీ ఆవుల మూత్రం, పెండపై రీసెర్చ్ చేసి, వాటిలోని ఔషధ గుణాలను వెలికితీసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న సైంటిస్టులు, రీసెర్చ్ సంస్థలు ప్రపోజల్స్ పంపాలని ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆవుకు ఉన్న ప్రత్యేకతలను సైంటిఫిక్‌గా తెలియజెప్పేందుకు రీసెర్చ్‌లు చేయాలని కోరింది. ఎంపికయ్యే ప్రపోజల్స్‌ను అమలు చేసేందుకు ప్రత్యేకంగా ‘సైంటిఫిక్ యుటిలైజేషన్ త్రూ రీసెర్చ్ ఆగ్మెంటేషన్ ప్రైమ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండిజీనస్ కౌస్ ప్రాజెక్టును కూడా కేంద్రం అమలు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ. 98 కోట్లు కేటాయించారని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఆవు నుంచి ఉత్పత్తి అయ్యే పదార్థాలతో షాంపూలు, కండిషనర్లు, ఆయిల్, టూత్ పేస్ట్‌లు, దోమల బత్తీలు, కేన్సర్, షుగర్ నివారణకు మందులను తయారు చేయడంపై ప్రతిపాదనలు పంపాలని కేంద్రం నోటిఫికేషన్లో పేర్కొంది. ‘‘దేశీ ఆవుల ఉత్పత్తులను వివిధ రోగాల నివారణ కోసం చాలామంది ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.
ఇప్పటివరకూ వీటిపై సైంటిఫిక్‌గా రీసెర్చ్, స్టడీలు జరగలేదు. ఆవు మూత్రం, పెండలో ఉండే రసాయనాలు, వాటి గుణాలను గుర్తించాలని, వాటితో మెరుగైన యాంటీబయాటిక్స్ తయారు చేసేందుకు ఉపయోగపడే బయోయాక్టివ్ సూత్రాలను రూపొందించాలని కోరింది. కేన్సర్, షుగర్ వంటి జబ్బుల నివారణ కోసం ఆవు మూత్రం, పెండలో ఉన్న ఔషధ గుణాలను వెలికి తీయాలని సూచించింది.