దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా నిర్భయ కేసు ఎంత వివాదం రేపుతుందో అందరికీ తెలిసిందే. ఏడేళ్ల క్రితం ఓ మెడికల్ విద్యార్థిని కొంత మంది దుర్మార్గులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన సంఘటనలో కొన్ని రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది. అప్పట్లో దేశ వ్యాప్తంగా నిర్భయ చావుకు కారణం వారిని ఉరిశిక్ష విధించాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేలరేగింది. దాంతో ఆ నింధితులకు ఉరిశిక్ష ఖరారు చేశారు.. కానీ ఇప్పటి వరకు అమలు పర్చలేదు. ఈ నెల మొదటి వారంలో ఉరిశిక్ష అమలు చేస్తారని చెప్పినా.. కొన్ని కారణాల వల్ల క్యాన్సల్ అయ్యింది.
తాజాగా నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. మార్చి 3న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలనీ పాటియాలా కోర్టు తీర్పు చెప్పింది. నలుగురు దోషులను ఉదయం 6 గంటలకు ఉరితీయాలని కోర్టు తీర్పు చెప్పింది. నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో నిందితులను నలుగురు మార్చి 3 న ఉదయం ఆరు గంటలకు ఉరి తీయాలని.. ఈ మేరకు పాటియాలా హౌకోర్టు సోమవారం కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. నిర్భయ దోషులకు విడిగా ఉరిశిక్ష అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే జడ్జి సొమ్మసిల్లి పడిపోవడంతో తీర్పు వాయిదా పడింది.
అంతకు ముందు దోషి వినయ్ శర్మ పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీం కోర్టు. వినయ్ శర్మ మానసిక ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని క్షమాభిక్షకు అర్హులు కాదని పేర్కొంది. కాగా ఈ రోజు విచారణ ప్రారంభమైన వెంటనే, తిహార్ జైలు స్టేటస్ రిపోర్టును కోర్టుకు అందజేశారు. కేసు యొక్క ప్రస్తుత స్థితి గురించి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్ కోర్టుకు వివరించారు. నలుగురిలో ముగ్గురికి తమ చట్టపరమైన అవకాశాలను ఇప్పటికే రద్దు చేశారని చెప్పారు. , ఏ కోర్టులోనూ పిటిషన్ పెండింగ్‌లో లేదని.. దోషులపై కొత్త డెత్ వారెంట్ జారీ చేయమని నిర్భయ కుటుంబం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు.