ఉప్పు ఉప్పు నిప్పులా ఉండే రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఇద్దరు మంత్రులు ఒకే వేదికపై ఉంటే అక్కడి వాతావరణం ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం మీడియా ముందు ఒకరి పార్టీని మరొక పార్టీ విమర్శించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఎవరి పార్టీ గురించి వారు గొప్పగా చెప్పుకునేందుకు ఒకరికొకరు విమర్శించుకోవడం, ఒకరికొకరు కౌంటర్లు వేసుకోవడం ఇలా ఇదంతా ఒకే వేదికగా జరిగితే చూసేవారికి ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగించక మానదు. అటువంటి సంఘటనే తాజాగా తెలంగాణ లో జరిగింది. హైదరాబాదులోని చర్లపల్లి రైల్వే స్టేషన్ శాటిలైట్ స్టేషన్ నిర్మాణానికి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు.


 ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ కు కౌంటర్ ఇచ్చేందుకు srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రయత్నించారు. కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని తెలంగాణ మంత్రి తలసాని విమర్శించారు. దీంతో అసహనానికి గురైన కేంద్రమంత్రి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది అంటూ కౌంటర్ ఇచ్చారు. యూపీఏ హయాంలో తెలంగాణకు కేవలం 258 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2602 కోట్లు ఇచ్చిందని చెప్పారు. 


ఇంత చేస్తున్నా దక్షిణ భారతదేశాన్ని కేంద్రం చిన్న చూపు చూస్తోందని విమర్శించడం సరికాదంటూ చెప్పారు. ఆయా రాష్ట్రాలు సహకరిస్తేనే రైల్వేలైన్లు త్వరగా పూర్తవుతాయని ఈ సందర్భంగా పీయూష్ చెప్పారు. ప్రసంగాలు లో ఒక ప్రభుత్వం పై మరో ప్రభుత్వం కౌంటర్లు వేసుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ వాతావరణం వేడిక్కింది. చివరికి ఏ వివాదం లేకుండా సభ ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చాలాకాలంగా బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరి పార్టీని టార్గెట్ చేసుకుంటూ మరో పార్టీ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకే వేదికపై ఇలా రెండు పార్టీల మంత్రులు పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: