తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డ్ శుభవార్త చెప్పింది. ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ చదివే విద్యార్థుల కోసం ఒక యూట్యూబ్ ఛానెల్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ సంవత్సరం జూన్ నెల నుండి బోర్డు యూట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పనుంది. బోర్డు ఇప్పటికే ఈ ఛానెల్ లో వీడియోలను పొందుపరుస్తున్నట్టు తెలుస్తోంది. 
 
అన్ని సబ్జెక్టుల పాఠాలను రూపొందించిన తరువాత నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన జరిపి బోర్డు కమిటీ అప్రూవల్ తీసుకోనుంది. బోర్డు విద్యార్థులు సైన్స్ ప్రాక్టికల్స్ ఎలా చేయాలనే దాని గురించి కూడా వీడియోలను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో యూట్యూబ్ ఛానెల్ ద్వారా బోర్డు జేఈఈ, నీట్ కు సంబంధించిన పాఠాలను కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచనుందని తెలుస్తోంది. 
 
థర్డ్ పార్టీ ఇప్పటికే బోర్డు రూపొందించిన వీడియోలలో తప్పుల్ని సరిద్దుతోంది. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అధికారులను సంప్రదించి వారి సహాయసహకారాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. బోర్డు వీడియో పాఠాలను రూపొందించటం కోసం టీ శాట్ సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 
 
బోర్డు యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాఠాలను అందుబాటులోకి తీసుకొనివస్తే విద్యార్థులు పాఠాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు వినవచ్చు. యూట్యూబ్ లోని వీడియోల ద్వారా విద్యార్థులు పాఠాలను రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది. బోర్డు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే నెల 4వ తేదీ నుండి జరగనున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు యూట్యూబ్ ద్వారా వీడియో పాఠాలను రూపొందిస్తూ ఉండటంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ వీడియో పాఠాలు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు.                  

మరింత సమాచారం తెలుసుకోండి: