తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నక్కా బ్రహ్మానందం అనే లారీ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగుడు గుడారిగుంటలో నివశిస్తున్న నక్కా బ్రహ్మానందాన్ని కత్తితో నరికి హతమార్చాడు. భార్య కళ్లెదుటే బ్రహ్మానందాన్ని ముఖానికి మాస్క్ ధరించి వచ్చిన దుండగుడు దారుణంగా హతమార్చాడు. స్థానికులు ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగుడు తన కళ్ల ముందే భర్తను దారుణంగా హత్య చేయటంతో యువతి షాక్ కు గురైంది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే దారుణం జరిగిపోయింది. హత్య చేసిన వెంటనే దుండగుడు ఘటనాస్థలం నుండి పరారయ్యాడు.
పోలీసులు ఇప్పటికే నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాత కక్షలతోనే ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా...? అంత దారుణంగా బ్రహ్మానందాన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది...? అనే విషయాల గురించి మృతుడి భార్య నుండి, స్థానికుల నుండి సమాచారం తెలుసుకొని ఆ సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు తరువాత ఈ కేసులో నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
పోలీసులు అర్ధరాత్రి సమయంలో దుండగుడు కొంత సమయం పాటు తగాదా పడి విచక్షణారహితంగా హత్య చేసి పరారయ్యాడని చెబుతున్నారు. హత్యకు గురైన బ్రహ్మానందంకు బయటి వ్యక్తులతో ఏవైనా తగాదాలున్నాయా...? ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన గొడవలు ఏమైనా ఉన్నాయా...? అనే విషయం తెలియాల్సి ఉంది. అర్ధరాత్రి సమయంలో బ్రహ్మానందం హత్యకు గురి కావడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.