విజయవాడలో జరిగిన పదాదికారుల సమావేశానికి ముగ్గురు రాజ్యసభ ఎంపిలు షాక్ ఇచ్చారు.  వీళ్ళ ముగ్గురు తెలుగుదేశంపార్టీలో నుండి ఫిరాయించిన సుజనాచౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్ కావటంతో మరింత సంచలనంగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలు తదితరాలపై చర్చించేందుకు బిజెపి పదాదికారుల సమావేశం విజయవాడలో మొదలైంది. అయితే ఈ సమావేశానికి ముగ్గురు ఫిరాయింపు ఎంపిలు గైర్హాజరవ్వటం సంచలనంగా మారింది.

 

బిజెపిలోకి ఫిరాయించన తర్వాత సిఎం రమేష్, టిజి వెంకటేష్ కన్నా సుజనా చౌదరి చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. అందులోను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కాలం రెచ్చిపోయాడు.  ముఖ్యంగా మూడు రాజధానుల ఏర్పాటు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్, పిపిల సమీక్ష లాంటి అంశాల్లో అయితే జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడాడు.

 

చంద్రబాబునాయుడును రక్షించటమే ముఖ్య ఉద్దేశ్యంగా సుజనా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం అందరికీ తెలిసిపోతోంది. అసలు మూడు రాజధానుల విషయంలో అయితే చాలా రెచ్చిపోయాడు. అయితే సుజనా రెచ్చిపోవటం అదే పార్టీకి చెందిన మరో రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు గాలి తీసేయటం మామూలైపోయింది. సుజనాకు మాట్లాడిన ప్రతి మాటకు, వ్యాఖ్యకు జీవిఎల్ నియమాలను, నిబంధనలను చూపుతు కేంద్రప్రభుత్వం ఆలోచనగా కౌంటర్లు ఇవ్వటంతో సుజనాకు గాలి తీసేసినట్లయింది.

 

అంటే తాను చెప్పుకుంటున్నట్లుగా బిజెపిలో సుజానకు పెద్ద సీన్ లేదన్న విషయం అందరికీ తెలిసిపోయింది. దాంతో చేసేది లేక చాలా రోజులుగా సుజనా ఏమీ మాట్లాడకుండా మవునంగా ఉంటున్నారు. అదే సమయంలో సిఎం రమేష్ రాష్ట్ర వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.  సరే పార్టీలో వాళ్ళమధ్య ఏమి జరుగుతోందో ఏమో కానీ పదాదికారుల సమావేశానికి వెళ్ళినా జీవిఎల్, సోమువీర్రాజు లాంటి వాళ్ళ ముందు నోరెత్తే అవకాశం లేదని అనుకున్నట్లున్నారు. అందుకనే ఏకంగా సమావేశానికి గైర్హాజరైపోయారు. మొత్తం మీద ఒకేసారి ముగ్గురు ఎంపిలు కీలకమైన సమావేశానికి డుమ్మా కొట్టడం పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: