తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నాయకురాలిగా ఉన్న సమయంలో డీకే అరుణ హవా ఓ రేంజ్ లో ఉండేది. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రేదేశ్ లో మంత్రిగా కూడా పనిచేసారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షా పదవి కోసం ప్రయిత్నించారు. కానీ అనోహ్య పరిణామాల నేపథ్యంలో ఆమెకు ఆ పదవి దక్కలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణకు మంచి పట్టు ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పేసి బీజేపీలో చేరిపోయారు. ఇక బీజేపీలోనూ ఆమె చక్రం తిప్పాలని చూసినా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. 


తెలంగాణాలో జరిగిన శాసన సభ ఎన్నికలే కాకుండా పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఆఖరికి సహకార సంఘాల ఎన్నికల్లో కూడా బీజేపీకి పరిస్థితులు పెద్దగా అనుకూలంగా లేకపోవడంతో  డీకే అరుణ హవా పెద్దగా పెరగలేదు సరికదా తగ్గుతూ వస్తోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత నుంచే ఆమె రాష్ట్ర స్థాయి నేతగా బీజేపీలో ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె సక్సెస్ కాలేకపోతున్నారు.  బీజేపీలోనూ.. ప్రజల్లోనూ ఆమె మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ఆమె మధ్య నిషేధ ఉద్యమం కూడా చేసారు. ఈ ఉద్యమం ద్వారా తన సత్తా చాటాలని చూసినా ఫలితం దక్కలేదు. 


ప్రస్తుతం ఆమె బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి పై కన్నేసినట్టు తెల్సుతోంది. దీని కోసం ఆమె బీజేపీలోని ఓ అగ్ర నేత ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తెలంగాణాలో కేసీఆర్ ను సమర్ధవంతంగా ఢీ కొట్టాలంటే తానే సమర్ధురాలిని అని అరుణ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ నాయకులు రామ్ మాధవ్ ను కూడా తన పదవి విషయమై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే కొత్తగా పార్టీలోకి వచ్చిన అరుణ కు వెంటనే కీలక బాధ్యతలు అప్పగిస్తే సీనియర్ నాయకుల్లో తప్పుడు సంకేతాలు వెలువడతాయనే ఉద్దేశంలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: