భార్య భర్తల మధ్య బంధం అంటే నూరేళ్ళ పంట అని అంటారు.. అయితే ఈ బంధం ఒకసారి మూడు మూళ్ళ బంధంతో ముడి పడి ఉంటుంది. వేదమంత్రాల సాక్షిగా జరిగిన ఈ బంధం ఎప్పుడు గట్టిగా ఉంటుందని పెద్దలు అంటుంటారు. అయితే ఈ బంధం బలంగా ఉండాలంటే ఇద్దరి మధ్య నమ్మకం ఉంటె ఆ బంధం నూరేళ్లు హాయిగా ఉంటుందని పూర్వికులు చెబుతుంటారు. 

 

 


 ఒక్క బంధానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇందులో ముఖ్యంగా భార్యభర్తల బంధం. ఎందుకంటే చాలా మంది ఈ బంధంలోనే ఎక్కువకాలం కలిసి ఉంటారు కాబట్టి. అందుకే పెళ్లి విషయంలో ప్రతీ ఒక్కరూ ఎన్నో విషయాలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, పూర్వకాలంలో వివాహబంధం అంటే కలకాలం కలిసి ఉండేలా ఉండేది. 

 

 


ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు రావడం అనేది సహజం.. ఎన్ని గొడవలు వచ్చినా.. ఏం జరిగినా మరణం అంచులకి చేరేవరకూ భార్యభర్తలు కలిసే ఉండేవారు. కానీ, నేడు అలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట మినహా పెద్దగా కనిపించడం లేదు. ఇందుకు విచ్చలవిడితనం స్వేచ్ఛతత్వం కూడా ఒకటని చెప్పొచ్చు. అవును నేను ఎందుకు అణిగిమణిగి ఉండాలి. అన్న ధోరణి ఇద్దరిలోనూ పెరిగిపోయింది. దీంతో తప్పులు జరిగిపోతున్నాయి..

 

 

అభిప్రాయాలు పంచుకోవడం మాత్రంలోనే కాదు.. శృంగారం విషయం, ఇలా ప్రతి విషయంలోనూ ఇదే ఫాలో అవ్వాలి. మనం ఒక బంధాన్ని ఎంత బాగా నమ్మితే.. ఆ బంధం మన చివరి రోజుల వరకూ అంతే తోడుగా ఉంటుంది. కాబట్టి.. ప్రతి ఒక్కరూ ఆ బంధాన్ని అందంగా ఉంచండి.. ఆస్వాదించండి. ఏ బంధం అయినా సరే ఆస్వాదించినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. కాబట్టి వాటిని దూరం చేసుకోవద్దు.. ఎంత బిజీగా ఉన్నా సరే మీరు అనుకున్నవ వారితో కాలం గడపండి.. ఆనందంగా జీవించండి.. హాయిగా ఉండండి. అంటూ నిపుణులు అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: