దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు విషయంలో ప్రభుత్వాన్ని.. కోర్టుని దోషుల తరపున వాదిస్తున్న న్యాయవాది ఏపీ సింగ్ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నా రంటూ బాధితురాలి తల్లి ఆరోపించారు. ఎన్‌కౌంటర్ తో దిశ కుటుంబానికి న్యాయం జరిగిందని, తన కూతురి విషయంలోనే శిక్ష అమలు జాప్యం ఆవేదన కలిగిస్తోందని నిర్భయ తల్లి ఆశాదేవి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో దిశ హత్య తర్వాత నిందితులకు జనం ఏం జరగాలని కోరుకున్నారో అదే జరిగిందని, అందుకే నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినప్పుడు వారిపై పూల జల్లు కురిసిందని అమె వ్యాఖ్యానించారు. కానీ నా కూతురు చనిపోయి ఏళ్లు గడుస్తున్నా.. దోషులు ఎదురుగా ఉన్నా వారిని ఏమీ చేయలేపోతున్నాని... న్యాయ ప్రక్రియ ఆలస్యమయ్యేందుకు ఆయనే కారణమంటూ మండిపడ్డారు.
ఉరిశిక్ష పడిన నలుగురు నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ మానసిక పరిస్థితి బాగోలేదంటూ సదరు న్యాయవాది మళ్లీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా, నిర్భయ దోషి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కేసుకు సంబంధించి శిక్షను అనుభవిస్తున్న వినయ్ శర్మ తీహార్ జైల్లో గోడకు తలను బాదుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. అతని మానసిక పరిస్థితి బాగాలేదని.. అతడు తన తల్లిని కూడా గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడని ఆయన తరుపు న్యాయవాది అంటున్నారు. మరోవైపు నిర్భయ దోషులకు ఢిల్లీ పటియాలా కోర్టు ఇప్పటికే డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు వారిని ఉరి తీయాలంటూ తీర్పునిచ్చింది. నలుగురినీ ఒకే సారి ఉరి తీయాలని తీహార్ జైలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. నిర్భయ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. దోషుల తరపు లాయర్‌కు ఇప్పుడు ఏమి చేయాలో తోచడం లేదు. దీంతో ఆయన కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వినయ్ సింగ్ బాగానే ఉన్నాడు. అతడి మానసిక పరిస్థితి కూడా బాగానే ఉంది అని ఆమె పేర్కొన్నారు.