అతనిని అందరూ.. ‘మ్యాడ్’ మైక్ అంటుంటారు. కానీ అతని అసలు పేరు మైక్ హగ్స్. దీనికి కారణం పెద్ద కధే వున్నది. తన 18వ ఏటనుండే మైక్ హగ్స్, సృష్టికి ప్రతి సృష్టి చేస్తానని తన స్నేహితుల దగ్గర గప్పాలు కొట్టి, వారిని నమ్మ బలికేవాడు. మైక్ అంతరంగాన్ని గ్రహించిన సదరు స్నేహితులు, కుటుంబ పరివారం అంతా అతన్ని సరదాగా మ్యాడ్ మైక్ అని పిలిచేవారు. ఇక అప్పటినుండి, మైక్ హగ్స్ అలియాస్ మ్యాడ్ హగ్స్ గా రూపాంతరం చెందారు.
అసలు విషయమేమంటే, భూమి గుండ్రంగా లేదని, ఫ్లాట్ గా ఉందన్నది ఆయన ప్రతి వాదన. ఎప్పటికైనా దానిని ప్రూవ్ చేసి తీరతానంటూ.. ఏకంగా సొంతంగానే రాకెట్లు తయారు చేసుకుని, అంతరిక్షానికి ఎగిరేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలోనే.. 64 ఏళ్ల వయసులో అతి దయనీయ పరిస్థితులలో అయన బలైపోయిన సంఘటన, శనివారం అమెరికాలోని కాలిఫోర్నియా సమీపంలో వెలుగు చూసింది.
కాలిఫోర్నియా సమీపంలో.. గల బార్ స్టో వద్ద సొంతంగా తయారు చేసిన స్టీమ్ ఇంజన్‌తో నడిచే రాకెట్‌ను మైక్ సిద్ధం చేసుకొని, పైకి ఎగిరారు. కానీ విధి, వెక్కిరించింది... ఎగిరిన కొద్ది సేపటికే, రాకెట్ కుప్ప కూలిపోవడంతో ఆయన మృత్యు వాత పడ్డారు. మైక్ సదరు కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 50 ఏళ్ళ వయసు గల మైక్ భార్య మాత్రం, మైక్ ని ఆకాశానికెత్తేసింది. మైక్ మొదటి నుండి చాలా మొండి వాడని, బై బర్ట్ అయన జీనియస్ అని, కానీ.. అజ్ఞానులు అయిన ప్రజలు, అతన్ని మేడ్ మైక్ అనేవారని ఈ సందర్భంగా చాలా ఎమోషనల్ అయ్యారు.
అయితే, ఇక్కడ కొసమెరుపు ఏమంటే, మైక్ సిద్ధాంతం.. "భూమి గుండ్రంగా లేదు! బల్ల పరుపు గా వుంది." అనే దాన్ని అతని భార్య సపోర్ట్ చెయ్యడం. కానీ, ఆమె వాదనను కూడా విన్న వారంతా.. ఆమెపై జాలి ప్రకటిస్తున్నారు. పాపం, మైక్ పోయిన బాధలో ఈమె కూడా... మేడ్ అయిందేమో అని... సదరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మైక్ తన రాకెట్ తో ఎగరడం ఇది ఫస్ట్ టైం ఏమి కాదు, అతను 2018లో ఒకమారు ట్రై చేసి, విఫలమై ఒక భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు అని సదరు కుటుంబీకులు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా మైక్ సాహసాన్ని పొగడకుండా ఉండలేం.