అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ తొలి రోజు పర్యటన సూపర్ సక్సెస్ అయింది. ట్రంప్, మెలానియా దంపతులు తొలిరోజు పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రపంచ అగ్ర రాజ్యాధిపతికి వేలాది మంది ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అనంతరం సబర్మతి ఆశ్రమానికి చేరుకుని ట్రంప్ సందేశాన్ని రాసి సంతకం చేశారు. అక్కడి నుండి మోతెరా మైదానానికి చేరుకుని నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఈ సభకు వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత ఆగ్రాకు వెళ్లిన ట్రంప్ దంపతులు తాజ్ మహల్ అందాలను తిలకించి కేంద్రం ఏర్పాటు చేసిన టూరిస్ట్ గైడ్ ద్వారా తాజ్ మహల్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐటీసీ మౌర్య హోటల్ కు చేరుకున్నారు. ఈ రాత్రికి హోటల్లోనే ట్రంప్ దంపతులు బస చేయనున్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ట్రంప్ పర్యటన నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేసింది. 
 
ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తి భారత్ కు రావడం... ప్రభుత్వం అధికారికంగా ఆ వ్యక్తి పర్యటనకు ఏర్పాటు చేయడం... ఇద్దరూ కలిసి భారీ బహిరంగ సభలో ప్రసంగాలు చేయడం... ఒక క్రికెట్ స్టేడియం లో జరిగిన బహిరంగ సభకు లక్షల సంఖ్యలో జనం హాజరు కావడం... మన దేశంలోనే ప్రపంచ చరిత్రలోనే నమోదు చేసుకోవాల్సిన చారిత్రక సంఘటన అని చెప్పవచ్చు. 
 
ట్రంప్ భారత్ పర్యటన సూపర్ సక్సెస్ అయిందనే చెప్పవచ్చు. భారత్ ఏదైతే కోరుకుందో ట్రంప్ కూడా అవే అంశాల గురించి ప్రస్తావించడం గమనార్హం.ట్రంప్ రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజంను కంట్రోల్ చేసి తీరతామని చెప్పటంతో పాటు భారత్ అమెరికా సంబంధాలకు మరో అడుగు ముందుకేసిందని చెప్పటం పట్ల భారత దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.                             

మరింత సమాచారం తెలుసుకోండి: