కామాంధులను కట్టడి చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టమైన దిశ చట్టాన్ని తెచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. పసికందు నుంచి పండు ముసలి వరకు పశువుల్లా మీదపడి కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఆడపిల్ల అర్ధరాత్రి స్వాతంత్రంగా బయట తిరిగినపుడే స్వాతంత్య్రం వచ్చింది అన్నాడు ఓ మహానుభావుడు. కానీ ఇప్పుడు అమ్మాయిలు పట్టపగలు తిరగాలన్నా భయపడిపోతున్నారు. ఈ కామ పిశాచాల మధ్య మహిళలకు రక్షణ లేకుండా పోయిందనడానికి ఈ ఘటనే నిదర్శనం.

 

ట్రిపుల్ ఐటీ సమీపంలోని రాత్రివేళ తండ్రి కోసం ఎదురుచూస్తున్న మైనర్‌ బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ట్రిపుల్ ఐటీ సమీపంలో వదిలేసి పారిపోయాడు.

 

నూజివీడుకు చెందిన వ్యక్తికి ఓ కుమార్తె ఉంది. మంగళవారం సాయంత్రం ఓ పని నిమిత్తం బయటకు వెళ్లిన అతడు రాత్రయినా ఇంటికి చేరుకోలేదు. దీంతో కంగారుపడిన బాలిక తండ్రి కోసం రాత్రివేళ్ల రోడ్డుపైకి వెళ్లి ఎదురు చూడసాగింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి బాలికను గమనించి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోకి ఎత్తుకెళ్లాడు. ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడి బాలికను ట్రిపుల్ ఐటీ సమీపంలో వదిలేసి పరారయ్యాడు.

 

రక్తస్రావంతో బాధపడుతున్న బాలిక ఏడుస్తూ పెట్రోల్ పోలీసుల కంట పడింది. దీంతో వారు ఏం జరిగిందని బాలికను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న నూజివీడు పోలీసులు నిందితుడి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

 

ఓ వైపు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దేశంలో ఏదో ఓ చోట మహిళలపై అత్యాచారం, హత్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే ఇక ముందు అయినా ఇలాంటి ఘటనలను కొంత మేరకు అరికట్ట వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: