దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఏపీలో అధికారం అనుభవిస్తున్న అగ్రకులాలు ఏవైనా ఉన్నాయంటే...అవి కమ్మ, రెడ్డి సామాజికవర్గాలే. చాలా కాలం నుంచి ఈ రెండు వర్గాల మధ్యే అధికారం అటు ఇటు మారుతూ వస్తుంది. ఇక రాష్ట్రం విడిపోయాక కూడా అదే పరిస్తితి కొనసాగుతుంది. 2014లో కమ్మ సామాజికవర్గం మద్ధతు ఉండే టీడీపీ అధికారంలోకి వస్తే, 2019లో రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఉండే వైసీపీ అధికారం దక్కించుకుంది.

 

అప్పుడు కమ్మ వర్గానికి చెందిన చంద్రబాబు సీఎం. ఇప్పుడు రెడ్డి వర్గానికి చెందిన జగన్. అయితే అధికారం ఈ రెండు వర్గాల మధ్యే ఉన్న, ఆ సామాజికవర్గాల్లో కూడా పేదవాళ్లు ఉన్నారు. అయితే వారికి ఏ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన పథకం గానీ, కార్పొరేషన్ గానీ పెట్టలేదు. సాధారణంగా వచ్చే పథకాలు అందుతున్నాయి తప్ప, సెపరేట్‌గా ఓ పథకం కూడా అందడం లేదు.

 

అయితే ఏపీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్...ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు. అవిగాకుండా కులాల వారీగా పథకాలు కూడా అందించి ఆయా వర్గాల వారిని ఆదుకుంటున్నారు. బీసీ, ఎస్‌సి,ఎస్‌టి,మైనారిటీ, కాపులకు కొన్ని పథకాలు తీసుకొచ్చారు. ఆయా వర్గాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వారికి అండగా ఉంటున్నారు. ఇప్పటికే ఎస్సీ,ఎస్టీలకు చాలా పథకాలు అమలు చేస్తున్నారు. ఇటు బీసీల్లో మత్స్యకారులు, చేనేత కార్మికులకు కొత్త పథకాలు తీసుకొచ్చారు. త్వరలోనే నాయీ బ్రాహ్మణ, రజకలకు కూడా సాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే కాపు మహిళలకు కొత్త పథకం తీసుకొచ్చారు.

 

తాజాగా పేద బ్రాహ్మణ కుటుంబాల్లో ఉపనయనం (ఒడుగు) చేసుకోవడానికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసే నూతన పథకాన్ని ప్రవేశపెట్టాడానికి సిద్ధమయ్యారు. ఇలా అన్నీ వర్గాలని ఆదుకుంటున్న జగన్ రెడ్డి, కమ్మ వర్గాల్లో ఉన్న పేదలకు కూడా ఏదైనా పథకం గానీ, కార్పొరేషన్ గానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే రెడ్డి వర్గం విషయం ఏమో గానీ, కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి జగన్ కమ్మ, రెడ్డి వర్గాలకు ఇంకా ఏ విధంగా న్యాయం చేస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: