ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రజాసంక్షేమం కోసం సంచలనాత్మక నిర్ణయాలతో సుపరిపాలన అందిస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం. వైయస్సార్ పింఛన్ కానుక పేరిట.. సరికొత్త పథకం ప్రారంభించారు. అంతేకాదు 45 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దీంతో ఇది చారిత్రాత్మక నిర్ణయం గా మారింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ పెన్షన్ కానుక రేపటి నుంచి లబ్ధిదారులకు అందనుంది. 

 

 అయితే ఈ పింఛన్ కానుక అర్హులు అనర్హుల పై ఆంధ్ర రాజకీయాలలో పెద్ద చర్చే నడిచిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి అర్హులు అనర్హులు  ఎవరు ఉన్నారనే దానిపై సర్వే చేపట్టింది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలోనే అనర్హులను తీసివేయడం తో పాటు...అర్హులు  ప్రతి ఒక్కరికి పింఛను అందేలా చూడాలని నిర్ణయించింది. అయితే రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. కొంతమందికి ఇల్లు ఉన్నప్పటికీ తినడానికి తిండి కూడా ఉండదని ఇంకొంతమందికి....మరిన్ని ఇబ్బందులు  ఉంటాయని .. అందుకే ప్రభుత్వం లబ్ధిదారుల పై సరైన వెరిఫికేషన్ చేయాలని అంటున్నారు. 

 


 మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడున్నర లక్షల మంది పింఛన్ లబ్దిదారులు ఉండగా అందులో భారీ మొత్తంలో అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.. ఈ పింఛన్ కానుక నుండి అనర్హులను తీసేందుకు రీ  వెరిఫై చేసేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది అయితే ఈ నేపథ్యంలో ఎంతోమంది అనర్హులుగా గుర్తించి తీసి వేస్తుండటంతో  ప్రతిపక్షం కూడా ఇదే అంశాన్ని లేవనెత్తి ఎన్నో విమర్శలు కూడా చేసింది. అయితే ప్రస్తుతం జగన్ సర్కార్  చెప్పిన అంచనా  ప్రకారం నాలుగున్నర లక్షలమంది పింఛను అర్హులు అని తెలిపింది. కాగా ప్రస్తుతం రీ  వెరిఫై అనంతరం మూడు లక్షల మందికి వైయస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారులను గుర్తించింది  ప్రభుత్వం. అయితే 45 సంవత్సరాల వారికి పెన్షన్ గురించి పక్కన పెడితే వృద్ధులకు మాత్రం తప్పనిసరిగా పింఛన్ అవసరం ఉంటుంది అని ఇవ్వాలి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: