ఇటీవల చైనాను కరోనా వైరస్ వణికిస్తోంది ఆ విషయం తెలిసిందే.. ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించింది.  కొద్ది రోజుల క్రితం వరకు చైనా కే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు దక్షిణ కొరియా, ఇరాన్ దేశాల్లో విజృంభిస్తోంది. శనివారం ఒక్క రోజే ఇరాన్‌ లో 205 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇప్పటికే చైనా లో ఈ వైరస్ కారణంగా 2835 మంది చనిపోగా 79 వేల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. 

 

 

చైనా బయట నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అంటార్కిటికా మినహా అన్ని ఖండాలకూ ఈ వైరస్ విస్తరించడంతో.. కరోనా పేరు చెబితే చాలు జనం హడలిపోతున్నారు. ఇలాంటి  పరిస్థితుల్లో కరోనాకు తొలి వ్యాక్సిన్‌ ను రూపొందించామని అమెరికాకు చెందిన బయోటిక్ సంస్థ మోడెర్నా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌‌ ను మనుషులపై ప్రయోగాలకు సిద్ధం చేశామని తెలిపింది. 

 

 

ప్రయోగాల కోసం ఈ వ్యాక్సిన్‌ను అమెరికా ప్రభుత్వ పరిశోధకులకు పంపామని తెలిపింది. ఈ ట్రయల్స్ ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎంఆర్ఎన్ఏ- 1273 వ్యాక్సిన్‌‌ తొలి బ్యాచ్‌ ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్‌కు పంపినట్లు మోడెర్నా తెలిపింది. కొద్ది మంది ఆరోగ్యవంతులపై తొలి ప్రయోగం చేపడతామని ఆ సంస్థ వెల్లడించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యి, అనుమతులు వచ్చే సరికి కనీసం ఏడాది పట్టే ఛాన్స్ ఉంది.

 

తొలి దశ ప్రయోగం విజయవంతమైతే.. అది అందుబాటులోకి రావడానికి ముందు తదుపరి పరీక్షలు, రెగ్యులారిటీ అనుమతులు మొదలైనవి రావాల్సి ఉంటుంది. 2002లో సార్స్ విజృంభించినప్పుడు దాని వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్‌కు సిద్ధమయ్యే సరికి 20 నెలలు పట్టింది. కానీ.. కరోనా వైరస్ జన్యు సమాచారం తెలుసుకున్న ఆరు వారాల్లోనే వ్యాక్సిన్‌ను రూపొందించి, ఇంత త్వరగా మనషులపై ప్రయోగాలకు రెడీ చేయడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: