తెలుగు రాష్ట్రాలను కదిలించి వేసిన ఘటన దిశా హ్యత్యాచారం కేసు..  నలుగురు మృగాళ్లు రాక్షుసుల్ల్లాగా మీదపడి చెరచి అతి కిరాతకంగా పెట్రోల్ పోసి కాల్చేశారు. అయితే తక్షణమే స్పందించిన పోలీసులు ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, నిర్మన్యుస్య ప్రాంతం కావడంతో అమ్మాయిని కాపాడలేక పోయామని సదరు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే..  

 

 


ఈ ఘటన హైదరాబాద్ శివారు, చటాన్‌పల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు కింద అండర్ పాస్ రహదారిపై జరిగింది. రాత్రిపూట అందులో చీకటిగా ఉండడం, అక్కడ జనసంచారం అంతగా లేకపోవడంతో ఇలాంటి దారుణ ఘటనను ఎవరూ గుర్తించలేకపోయారు. అయితే, తాజాగా అలా చీకటిగా ఉండే అండర్ పాస్‌లన్నింటిలోనూ ప్రభుత్వం లైట్లను అమర్చింది. ఈ మేరకు పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ట్వీట్ చేశారు.

 

 


పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారం.. ఔటర్ రింగు రోడ్డు అంతటా ఉన్న అండర్ పాస్ రహదారుల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసినట్లు ట్వీట్ చేశారు. మొత్తం 165 అండర్ పాస్‌లలో ఈ ఏర్పాటు పూర్తయిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ లైట్లన్నింటిలో కొన్ని సోలార్ ఆధారంగా పని చేస్తాయని వివరించారు.ఇకపోతే ఈ లైట్లన్నీ కూడా మార్చి 3 నుంచి వాడుకలో వస్తాయని ఆయన ట్వీట్ చేశారు. 

 


అయితే, ఇలా అండర్ పాస్‌లలో లైట్లు ఏర్పాటు చేయడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అందరూ ఈ లైట్ల ఏర్పాటును స్వాగతించారు. దీంతోపాటు మరికొంత మంది ఇంకా చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు. దిశ ఘటన జరిగిన కొద్ది నెలల తర్వాత ప్రభుత్వం ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసిందనే ట్వీట్‌పై ఓ నెటిజన్ వ్యంగ్యంగా స్పందించాడు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా లూజ్ పెట్రోల్ స్వై విహారం చేస్తుందని, వెంటనే వాటిని బంద్ చేయాలనీ ఈ సందర్బంగా డిమాండ్ చేస్తున్నారు. 

As per instructions of minister @KTRTRS to ensure elimination of dark spots, lighting of all 165 underpasses underneath ORR, used as vehicular / pedestrian crossing, is completed & operational from March 3rd evening onwards

It’s a mix of solar standalone & conventional LED pic.twitter.com/6E3N44z0uI

— Arvind Kumar (@arvindkumar_ias) March 1, 2020 " />

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: