ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ 19 ప్రభావం ఇప్పుడు మార్కెట్ రంగంపై కూడా పడింది.  రస్ నివారణకు కావాల్సిన మందులు, మాస్కులు, వైద్య సిబ్బంది సిద్దం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలు.  కరోనాను రక్షించుకోవాలంటే మాస్కులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.  దాంతో ప్రాణాల కన్నా ఏదీ ఎక్కువ కాదు అనుకునే జనాలు ఇప్పుడు మాస్కుల పై పడ్డారు.   చాలా మంది ఫేస్ మాస్కుతోపాటూ... హ్యాండ్ శానిటైజర్లను ఎక్కువగా కొంటున్నారు.  కరోనా వైరస్ కారణంగా... ప్రపంచవ్యాప్తంగా మాస్కులు, ఇతరత్రా అలాంటి కాస్ట్యూమ్స్ వాడకం 70 శాతం పెరిగింది. తాజాగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, చెత్తాచెదారం మధ్యనే విధులు నిర్వర్తించే స్వీ పర్లకు కరోనా నివారణ కోసం ప్రత్యేక మాస్కులను పంపిణీ చేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. 

 

కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవల్సిన చర్యలపై ప్రభుత్వం కార్యచరణను సిద్దం చేసిందని వెల్లడించారు. కరోనా వైరస్, వ్యాప్తి, వ్యాధి లక్షణాలు, వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్త్రృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.  వైరస్ సోకకుండా వుండడానికి మాస్కులు ధరించాలన్న ఉద్దేశంతో చాలా మంది మాస్కులకు ఎగబడుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న మందుల దుకాణదారులు వాటి ధరలను అమాంతం పెంచేసి విక్రయిస్తున్నారు.  కొన్ని చోట్ల అసలు మాస్కులు లేవు.. స్టాక్ లేదని ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారు. చేసేది ఏమీ లేక జనాలు కూడా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఏందైనా వెచ్చించి మాస్కులు తీసుకుంటున్నారు. 

 

హోల్‌సేల్‌లో రూ.1.60 విలువ చేసే రెండు లేయర్ల మాస్కును ఇప్పుడు రూ.20-25 వరకు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తుండగా, రూ.30-40 విలువ చేసే ఎన్95 మాస్క్‌ను రూ.300 వరకు విక్రయిస్తున్నారు.  నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల వద్ద వీటికి మరింత డిమాండ్ ఉంది. అత్యంత చవగ్గా ఔషధాలు లభించే జనరిక్ మందుల షాపుల్లోనూ మాస్కుల ధర అమాంతం పెరిగిపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: