ప్రపంచ దేశాలు కరోనా భీతితో మొత్తం గజగజలాడుతోంది. ఈ వైరస్ వలన చైనాలో వేలాది మంది చనిపోయారని, లక్షలాది మందికి ఈ వైరస్ సోకిందనే విషయం తెలిసిందే.. ఇక ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించడంతో ఈ వ్యాధి పేరు వింటేనే వణికి పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకి చైనాతో పాటు భారత్ సహా అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ ఓ వ్యక్తికి కరోనా సోకడంతో కలకలం రేగుతోంది. ఇక ఏపీలోనూ ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయనే వార్త జనాల్ని భయాందోళలకు గురి చేస్తుంది. 

అయితే కరోనా పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ విషయం పై సీరియస్ గా చర్యలు తీసుకుంటుంటే.. ఒక వైపు ఈ ఇష్యూపై సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. మీమ్స్, ట్రోల్స్‌ లో ఒకర్ని మించి మరొకరు తమ క్రియేటివిటీని వాడేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం కరోనా వైరస్ గురించి కొంతమంది జాగ్రత్తలు చెబుతుంటే చార్మి, వర్మ లాంటి వాళ్లు జోకులు పేలుస్తున్నారు. చార్మి అయితే ఎక్కడలేని ఆనందం ఆమెలోనే ఉన్నట్టు.. కరోనా వైరస్ తెలంగాణకు వచ్చేసిందట అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పి పరువు పోగొట్టుకుంది. ఈ సందర్భంలో కరోనా వైరస్‌ పై మంచు లక్ష్మికి సంబంధించిన ఓ ఎడిటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

మంచు లక్ష్మిని సైతం ఇందులోకి లాగారని ఆమె అభిమానులు బాధపడుతున్నారు. ఆమె ఎవర్ గ్రీన్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోను తవ్వి మరీ తీసుకువచ్చి.. కరోనా వైరస్‌ లో లింక్ చేసి సోషల్ మీడియాలో పొట్టచెక్కలు చేసే వీడియోను వదిలారు. నిజంగానే కరోనా వైరస్ గురించి మంచు లక్ష్మి ఇలా మాట్లాడిందా అన్నట్టుగా ఉందట...

 

మంచు లక్ష్మి ఏం అంటుందో చూద్దాం.. కరోనా వైరస్ కాదని.. కర్రోనా వైరస్. అండ్ ది ఆర్ షుడ్ బీ రోలింగ్. అంటే.. ఆర్ అనేది రోల్ అవ్వాలన్నమాట. ఆర్ కిందపడి దొర్లాలన్న మాట అంటూ మంచు లక్ష్మి ‘కరోనా’లో ఆర్‌ని ఎలా పలకాలో క్లాస్ పీకుతోంది. ‘నీలు’ అనే టిక్ టాక్ అకౌంట్ ద్వారా ఈ వీడియోను షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో మంచి లక్ష్మి ‘ఆర్’ని ఎలా పలకాలో చెప్తున్నది ఇప్పటిది కాదు.. అది అపుడెపుడో సైమా అవార్డ్స్ వేడుకలో మాట్లాడిన మాటల్ని ఎడిట్ చేసి ఇదిగో ఇలా కరోనా వైరస్‌ కి వాడేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: