కరోనా.. ఇప్పుడు అందరినీ వణికిస్తున్న మూడక్షరాల పదం.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని తీవ్రంగా కలవర పెడుతోంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ దరిచేరదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య నిపుణులు చెబుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరిగా చేయాలంటున్నారు.

 

 

కరోనా ఎక్కువగా చేతుల ద్వారానే వ్యాపిస్తుంది. షేక్ హ్యాండ్ ఇవ్వడం, రోగులను తాకడం, రోగులు తాకిన వస్తువులను తాకడం వంటి చర్యల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు చేతులను కడుక్కుంటే వైరస్ అక్కడే అంతమైపోతుంది. కానీ అన్నిసార్లు చేతులు కడుక్కోలేం కదా.

 

 

అందుకే అలాంటప్పుడు శానిటైజర్ ఉపయోగపడుతుంది. అందుకే శానిటైజర్ ను తప్పకుండా వాడాలని సలహా ఇస్తున్నారు. వీటినైతే ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మనం ఉన్నచోటే చేతుల్ని శుభ్రం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో హ్యాండ్‌ శానిటైజర్లకు డిమాండ్‌ బాగా పెరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: