టిడిపి అధినేత చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యింది. ఆయన్ను ఎవరు ఎంతగా విమర్శించినా, ఎన్ని అవమానాలకు గురిచేసినా, ఆయన మాత్రం ఎక్కడా ప్రతి విమర్శా చేయలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇదే అదునుగా బాబు ను విమర్శించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. టిడిపి ప్రతిపక్షంలో ఉండడంతో చంద్రబాబుకు అధికారం దూరమవడంతో ఇదే అదునుగా ఆయన రాజకీయ ప్రత్యర్థుల తో పాటు వ్యక్తిగత కక్షలు ఉన్నవారు కూడా ఇప్పుడు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని తిట్టినా, తిరిగి కౌంటర్ ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు ఉండిపోతున్నారు. తాజాగా చంద్రబాబుపై విమర్శలు చేశారు ఆయన అత్తగారు, తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి.
చంద్రబాబు తన అల్లుడు అని చెప్పుకునేందుకు ఇప్పటికీ తాను సిగ్గుపడుతున్నానని, లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు కమ్మ జాతి పరువు తీస్తున్నారని, ఆయన అంత దుర్క్మర్గుడు ఎవరూ ఉండరంటూ లక్ష్మి పార్వతి మండిపడ్డారు. గతంలో అమరావతి పేరుతో తమ వారిని కూడా చంద్రబాబు వదిలిపెట్టకుండా, ఇబ్బందులకు గురి చేశారని, మళ్ళీ ఇప్పుడు ఆ కమ్మ వారి పరువు తీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, కమ్మ జాతి మొత్తం కాకపోయినా, కొంత మంది ఇంకా ఆయన చూస్తూనే తిరుగుతున్నారని, ఇది చాలా దురదృష్టకరం అని ఆమె వ్యాఖ్యానించారు.
చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం ఎవరిని వదిలిపెట్టని వ్యక్తి అని, ఆఖరికి తన భార్య, కోడల్ని కూడా తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ఇప్పుడు వారిని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ కు చేసిన ద్రోహం మామూలు ద్రోహం కాదని, ఆయన ఆ మనోవేదన తోనే మరణించారని, అసలు చంద్రబాబు జీవితంలో ఒక్క మంచి పని అయినా చేశారా అంటూ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. చంద్రబాబు గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే అని, ఆయన అంత స్వార్ధపరుడు మరెవరూ ఉండరు అంటూ లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.