ప్రపంచ దేశాలను  ప్రాణ భయంతో వణికిస్తు... ఎంతోమందిని కాటికి పంపిస్తున్న ప్రాణాంతకమైన వైరస్ కరోనా . తాజాగా భారతదేశంలోకి కూడా ప్రవేశించింది ప్రాణాంతకమైన వైరస్. భారత ప్రజలందరినీ ప్రాణభయంతో వణికిస్తోంది. కరోనా  వైరస్ భారతదేశంలోకి వ్యాపించకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఈ వైరస్ భారతదేశంలోకి ప్రవేశించింది. ఇక అటు కేంద్ర ప్రభుత్వం తో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలెర్ట్ అయిపోయాయి. ఏదైనా ప్రస్తుతం ప్రజలు కరోనా వైరస్ ఎఫెక్టుతో అయోమయంలో పడిపోయారు. ఏం చేయాలి ఏం చేయకూడదు అని కూడా తెలియని స్థితిలో ఉన్నారూ. 

 

 

 అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి... 95 వేల మందికి పైగా మృత్యువుతో పోరాడుతున్నారు. అయితే ప్రానంతకమైన వైరస్ బారిన పడకుండా ప్రాథమిక  శుభ్రతతో పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా వైరస్ బారిన పడకుండా ఉండవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. కేవలం చేతులు కడుక్కోవడం కాదు తరచూ మనం ఉపయోగించే స్మార్ట్ఫోన్లను లాప్టాప్ కూడా శుభ్రం చేసుకోవాలి అంటూ సూచిస్తున్నారు. స్మార్ట్ఫోన్ ల్యాప్టాప్ లపై కూడా వైరస్ లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేలా చూడాలని గ్లోబల్ హెల్త్ రీసెర్చ్ సూచిస్తోంది. 

 

 

 మీరు ఉపయోగించే స్మార్ట్ ఫోన్ ను  హ్యాండ్ కర్చీఫ్ ని ఓకే జేబు లో పెట్టకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు కర్చిఫ్  చేతులను శుభ్రం  చేసుకోవడం లేదా ముక్కు పెదాలను శుభ్రం చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. అలా చేసినప్పుడు ఒకవేళ మీ కర్చీఫ్  పైన వైరస్ చేరినప్పుడు... ఆ కర్చీఫ్ స్మార్ట్ఫోన్ కలిపి ఒకే జైలులో పెడితే కర్చీఫ్ నుండి స్మార్ట్ ఫోన్ కి వైరస్ బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంటుంది అంటూ సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా మీ హ్యాండ్ కర్చీఫ్ ని ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. లేకపోతే మీ హ్యాండ్ కర్చీఫ్ ఇతరులు వాడడం ద్వారా కూడా వైరస్ సోకే అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఫోన్ మాట్లాడేటప్పుడు ఇయర్ ఫోన్స్ వాడాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లి నెట్ వాడేవారు ఇది తగ్గించుకోవాలని చెబుతున్నారు లేదా గ్లోవ్స్స్  వేసుకొని ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: