మొత్తానికి తెలుగుదేశంపార్టీలో సీనియర్లలో చాలామంది చాలా తెలివిగా తప్పించుకుంటున్నట్లున్నారు. తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటి నుండి తాము తప్పుకుని ఇతరులకు స్వచ్చంధంగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారట. ఈ బిల్డప్ వెనక అసలు కథేమిటంటే ఓటమి భయం తప్ప మరోటి లేదని అందరికీ అర్ధమైపోతోంది. కానీ ఆ విషయాన్ని చెప్పకుండానే యువతకు ప్రోత్సాహం, యువతకు నాయకత్వం అనే స్లాగన్లతో యువ నేతలను వలలోకి లాగుతున్నారు.

 

నారా లోకేష్ దంపతుల ఆధ్వర్యంలో ఈమధ్యనే పార్టీలోని యువనేతలతో భేటి పేరుతో ఓ విందు రాజకీయం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.  ఈ విందులో 13 జిల్లాల్లోని ఎంపిక చేసిన యువనేతలు అంటే ప్రధానంగా వారుసులను మాత్రమే ఆహ్వానించారు లేండి. వీళ్ళను మాత్రమే ఎందుకు ఆహ్వానించారంటే సీనియర్లను అడ్డం పెట్టుకుని తమ జిల్లాల్లో అడ్డదిడ్డంగా దోచేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కాబట్టే.

 

సరే గడచిన ఐదేళ్ళల్లో వీళ్ళు దోచుకున్నదెంత ? దాచుకున్నదెంత ? అన్నది పక్కన పెడితే రేపటి ఎన్నికల్లో మాత్రం వీళ్ళకే పూర్తి బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు కూడా డిసైడ్ అయినట్లే అనిపిస్తోంది. అంటే సీనియర్లు తప్పుకుని జూనియర్లను బకరాలను చేసేస్తున్నట్లే అనిపిస్తోంది. బకారలంటే వీళ్ళ స్ధాయిలో వీళ్ళు  కూడా ముదుర్లే కానీ గెలుపు అవకాశాలు దాదాపు లేని సమయంలో రంగంలోకి దింపుతున్నారు కాబట్టే బకరాలని అనాల్సొస్తోంది.

 

అదే సమయంలో వామపక్షాలతో పొత్తులు పెట్టుకోవటం దాదాపు ఖాయమైపోయినట్లే. అంటే కొంత భారాన్ని చంద్రబాబు దింపేసుకుంటున్నాడనే అనుకోవాలి. మరి పదేళ్ళ తర్వాత వామపక్షాలతో పొత్తులు పెట్టుకోవటం వల్ల పార్టీకి వచ్చే లాభమేంటి ? అన్నది ఎవరికీ అర్ధం కావటం లేదు. కాకపోతే టిడిపికి క్షేత్రస్ధాయిలో వ్యవస్ధ దెబ్బతిన్నట్లే అనిపిస్తోంది. ఆ వ్యవస్ధను వామపక్షాలతో భర్తీ చేసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నాడేమో చూడాలి. చూద్దాం చంద్రబాబు రాజకీయానికి ఎవరు బలైపోతారో తేలిపోతుంది కదా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: