సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తర్వాత తాము ఎంత తప్పుగా మాట్లాడారో తెలుసుకొని నాలుక కరుచుకుని తాము చేసిన కాంట్రవర్షియల్ వ్యాఖ్యలను ఎవరికీ కనిపించకుండా డిలీట్ చేస్తుంటారు. కానీ వారు చేసిన వ్యాఖ్యలు క్షణాల్లోనే వైరల్ అయ్యి భారీ డ్యామేజ్ ను కలిగిస్తాయి. అయితే ఈ వారంలో అలాంటి వివాదాస్పద ట్వీట్ లను చేసిన వారిలో ముఖ్యంగా ముగ్గురు ఉన్నారని చెప్పుకోవచ్చు. 

 

 


మొదటిగా డ్రగ్ కేసులో ఇరుక్కొని బాధితురాలిగా బయటపడ్డ టాలీవుడ్ నటి ఛార్మి కౌర్... కరోనా వైరస్ గురించి వివాదాస్పద ట్వీట్ చేసి సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారితీసింది. కరోనా గురించి ఆమె ట్విట్టర్ లో ఒక వీడియో పెట్టి వ్యంగంగా నవ్వుకుంటూ... 'కరోనా వైరస్ ఢిల్లీ వచ్చిందంట, తెలంగాణాకి కూడా వచ్చిందంట. ఆల్ ది బెస్ట్ గాయ్స్, ఎంజాయ్ గరల్స్', అంటూ ఎంతో సంతోషంగా చెప్పేసింది. దాంతో ఆమెని నెటిజన్లు ఏకిపారేశారు. డ్రగ్స్ తీసుకొని వీడియోలు చేయకూడదమ్మా ధుచార్మి అని నానా విమర్శలు చేసారు. ఎట్టకేలకు ఆమెకు బుద్ది వచ్చి క్షమాపణలు చెబుతూ తన వీడియో ని తొలగించింది. 

 

 


మరోవైపు ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి కుళ్ళు జోకులు వేసి అందరి చేత చివాట్లు పెట్టించుకున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. ట్విట్టర్ లో ఒక పోస్టు చేసిన నాగబాబు... 'దేవ భక్తులందరూ కలసి ప్రార్థన ఆలయానికి వెళ్లి, ప్రసాదం తీసుకొని దర్శనం చేసుకొని ఇంటికి సేఫ్టీ గా వస్తే దేవుడు గొప్ప, లేకపోతే కరోనా వైరస్ గొప్ప' అని వ్యాఖ్యలు చేసి నెట్టింట రచ్చకు దారి తీసాడు. 

 

 


అలానే మెగాస్టార్ ఫ్యామిలీ లో భాగమైన ఉపాసన కొణిదెల మోడీ ట్విట్టర్ అకౌంట్ ని మహిళ దినోత్సవం రోజు హ్యాండ్ ఓవర్ చేసుకునేందుకు ఒక ట్వీట్ రూపంలో విజ్ఞప్తి చేసింది. ఆమె తన ట్వీట్ లో... 'మోడీ గారు, భారతదేశాన్ని ఆరోగ్యకరమైన దేశంగా ఎలా మార్చగలగాలో చెప్పేందుకు దయచేసి నాకు ఓ అవకాశం ఇవ్వండి. మన దేశ యువత సూపర్ ప్రొడక్టివ్ మారేందుకు నేను సరసమైన, సులభమైన పరిష్కారాలు తెలియజేయాలనుకుంటున్నాను', అని పేర్కొంది. అయితే ఆమె మంచి ఉద్దేశంతోనే ఈ ట్వీట్ చేసినప్పటికీ... నెటిజన్లు మాత్రం నెగిటివ్ గానే తీసుకున్నారు. ముందు మీ అపోలో హాస్పటల్ లో చౌకైన ధరలకే వైద్య సేవలు మెరుగ్గా అందించే విధంగా చూడండి. మీ అపోలో హాస్పటల్ లో సామాన్యుడు భరించలేని ఫీజులు ఉంటాయి. ముందు మీ ఆస్పటల్ గురించి చూసుకుని తర్వాత దేశం గురించి ఆలోచించండి అని చాలా మంది నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: