అసలు రాజకీయాలు అంటేనే వ్యూహం, ప్రతి వ్యూహం. తమ ప్రత్యర్థులు ఏదైనా చేద్దాం అని ఆలోచించే లోపులోనే అది అమలు చేసి చూపించడం నేటి రాజకీయాల్లో సర్వ సాధారణం అయిపోయింది. ఇక విషయానికి వస్తే, వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ఎంత ముందుచూపుతో ఉంటారో, ఎంత తెలివిగా ఆలోచిస్తారో ఓనిర్ణయం ద్వారా బాగా అర్థమవుతోంది. కొంతకాలంగా ఏపీలో అమరావతి వ్యవహారం కాక రేపుతున్న సంగతి తెలిసిందే. అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ మూడు నెలలుగా, అక్కడి పరిసర ప్రాంతాలలోని 29 గ్రామాల ప్రజలు, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఆందోళన కారణంగా వైసిపి ఆయా గ్రామాల్లో కాస్త దెబ్బతిన్నట్టుగా కనిపిస్తోంది. 

 

IHG


ఇప్పుడు ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ 29 గ్రామాలను దూరంగా ఉంచాలని జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదంటూ తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా  తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్లోనూ.. ఎన్నికలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఈ మేరకు రాజధాని గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించవద్దు అంటూ... ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చాలాకాలం క్రితమే ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎందుకంటే ప్రభుత్వం అమరావతిని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలని భావించింది. ఈ నగర పాలక సంస్థలో ఎర్రబాలెం, బేతపూడి, మంగళగిరి, నవులూరు గ్రామాలను పురపాలకలో, పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లిలోనూ కలపాలని ప్లాన్ చేసింది. 

 

IHG


మిగిలిన గ్రామాలన్నిటినీ కలిపి అమరావతి కార్పొరేషన్ గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. కోర్టు స్టే రావడంతో దానిని సాకుగా చూపిస్తూ మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీతో పాటు రాజధాని గ్రామాల్లో ఉన్న 29 గ్రామాల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై రాజధాని పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: