ప్రపంచంలో రోజురోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. తాజాగా వైద్య పరీక్షల పేరుతో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఒక వైద్యుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షల పేరుతో మహిళలను గదిలోకి తీసుకెళ్లి మత్తుమందిచ్చి మత్తులో ఉన్న మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఒక మానవ మృగం బాధితురాలి ఫిర్యాదుతో జైలుపాలయ్యాడు. 
 
ఆస్పత్రికి వచ్చిన రోగులపై అత్యాచారం చేయడంతో పాటు ఆ తతంగాన్ని మొబైల్ ద్వారా చిత్రీకరించి.. వీడియోలను మెమొరీ కార్డులో సేవ్ చేసుకున్న వైద్యుడి నిర్వాకాన్ని చూసి షాక్ అవ్వడం పోలీసుల వంతయింది. వైద్యుడి దగ్గర చాలా మెమొరీ కార్డులు ఉన్నట్లు... ఆ కార్డుల్లో వందల సంఖ్యలో వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఆస్పత్రితో పాటు వైద్యుడి ఇంట్లో తనిఖీ చేశారు. వైద్యుడి ఇంట్లో జరిపిన తనిఖీలో మరో భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. 
 
డాక్టర్ గదిలో సెక్స్ టాయ్స్ లభ్యమయ్యాయి. కొందరు పేషంట్లపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు సెక్స్ టాయ్స్ తో వికృత చేష్టలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక బాధితురాలు తాను మత్తులో ఉండగా తనపై వైద్యుడు రేప్ చేశాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వైద్యుడి నిజ స్వరూపం వెలుగులోకి వచ్చింది. యూఎస్ లోని ఓహియో రాష్ట్రంలో వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. 
 
పోలీసులు వైద్యుడి నివాసం నుండి మత్తు మందులు, మెమొరీ కార్డులు, సెక్స్ టాయ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓహియోకు చెందిన మనీష్ గుప్తా హై ఎండ్ ఎస్కార్ట్ సేవలు అందించే ఒక మహిళను సెక్స్ కోరికలు తీర్చుకునేందుకు బుక్ చేసుకున్నాడు. అనంతరం ఆ మహిళతో ఎంజాయ్ చేయకుండా మత్తు మందు ఎక్కించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పరీక్షల ద్వారా తనకు మత్తు మందు ఇచ్చినట్లు, స్పృహ లేని సమయంలో రేప్ చేసినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. లైంగిక వేధింపులు, నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, ఇతర అభియోగాలపై మనీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: