ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నుంచి ఆ పార్టీలోనే ఉన్న నేత రామసుబ్బారెడ్డి ఆ పార్టీని వీడి ఈరోజు వైసీపీలో చేరారని అన్నారు. దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న నాయకుడు ఈరోజు ఆ పార్టీని వీడి వైసీపీలోకి రావడం మంచి పరిణామంగా భావిస్తున్నామని చెప్పారు. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరతానంటే జగన్ మనస్పూర్తిగా ఆహ్వానించారని వ్యాఖ్యలు చేశారు. 
 
2019 ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం జగన్ తో ప్రయాణం కొనసాగించాలని అనుకుంటున్నానని రామసుబ్బారెడ్డి పలు సందర్భాల్లో చెప్పారని సజ్జల అన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చూసిన తరువాత రామసుబ్బారెడ్డి స్థిరమైన నిర్ణయం తీసుకుని ఈరోజు జగన్ సమక్షంలో పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. 
 
ముఖ్యమంత్రిగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు ఎలాగైతే అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయో వాటిని ప్రతిబింబించే విధంగా టీడీపీ నుంచి స్వచ్చందంగా వైసీపీలో నాయకులు చేరుతున్నారని అన్నారు. వైసీపీలో ఉంటే రాజకీయాల్లో ఉన్నందుకు తమ జీవితాలకు కూడా సార్థకత ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. రామసుబ్బారెడ్డి చేరిక తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. 
 
రామసుబ్బారెడ్డి చేరిక ప్రభావం ఖచ్చితంగా టీడీపీ పార్టీపై, ఆ పార్టీ నాయకత్వంపై పడుతుందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవహరించిన తీరు వల్ల పార్టీలో ఒక రకమైన నిస్తేజం వచ్చి అందరూ బాబు గారి నాయకత్వం మీద నమ్మకం సన్నగిల్లి వైసీపీలో చేరుతున్నారని వ్యాఖ్యలు చంద్రబాబు వ్యవహరించిన 
తీరుతో ప్రజల విశ్వాసం కోల్పోయారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.                                             

మరింత సమాచారం తెలుసుకోండి: