ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో ఆంధ్ర రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి ఎన్నికలు వస్తుండటంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తిని సంతరించుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి  అన్ని పార్టీలు. స్థానిక సంస్థల ఎన్నికలకు గాను కొన్ని పార్టీలు సర్దుబాట్లు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా టిడిపి సిపిఐ పార్టీలో పలుచోట్ల సర్దుబాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కడక్కడ టిడిపి జనసేన పార్టీలు  కూడా సర్దుబాటు జరుగుతున్నాయంటూ టాక్  వినిపిస్తుంది. 

 

 ఇక జనసేన బీజేపీ పార్టీలు పొత్తుగా  ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఇలా సర్దుబాటు జరుగుతుంటే పంచాయతీల విషయంలో కూడా ఇప్పటికే కాంప్రమైస్ లు  జరుగుతున్నట్లు సమాచారం. అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులతో తెలుగుదేశం పార్టీ నాయకులు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలోని కొన్ని ఏరియాల్లో సర్దుబాట్లు  చేసుకుంటున్నట్లు సమాచారం. అంటే ఆయా ఏరియాల్లో ఎవరికీ బలం ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయకుండా ఉండేలా.. పదవి లేకపోతే ఇబ్బంది పడకుండా ఉండేందుకు వైస్ ప్రెసిడెంట్ పదవిని కూడా ఇచ్చేందుకు సర్దుబాటు చేసుకుంటున్నారు. 

 


 అంతేకాకుండా ఇంతకుముందు సర్పంచ్ గా ఉన్న వారిని ప్రస్తుతం డిప్యూటీ సర్పంచ్ గా.. లేదా వార్డు నెంబర్ల కోటలో ఉన్న వారికి డిప్యూటీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేలా సర్దుబాట్లు చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఈ సర్దుబాటులో సామాజిక వర్గాల వారీగా కూడా సర్దుబాటు ఉన్నట్లు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట్ల కాపు సామాజికవర్గం వాళ్ళు టై అప్  చేసుకుంటున్నారు అనే మాట ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇక అటు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోకుండా లోకల్ నాయకులకే ఇదంతా వదిలేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ సర్దుబాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీకి చెందిన నేతలు మెయిన్ పోస్ట్  కావాలని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నేతలకు జగన్ వార్నింగ్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అంటే ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్ లో పార్టీలకతీతంగా సర్దుబాటు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: