ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంతో వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిపోయింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల కోసం జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఓ సరికొత్త నిబంధనలు తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకొచ్చిన నిబంధనలపై ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు ఎంతో మంది ప్రజలు కోరుకున్నది కూడా ఇదే. ఎన్నికల్లో ఎలాంటి డబ్బు మద్యం పంచకుండా ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా... ఎన్నికలు జరగాలని ఇప్పటి వరకు ఎంతో మంది విద్యావంతులు.. ఎంతో మంది ప్రజలు కూడా కోరుకున్నారు. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఇలాంటి నిర్ణయాన్ని తెరమీదికి తెచ్చింది .
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు డబ్బు మద్యం పంచవద్దని ఒకవేళ అలా పంచుతున్నట్లు తెలిస్తే మూడేళ్ల శిక్ష తో పాటు అనర్హత వేటు వేస్తామని అంటూ నిబంధన పెట్టింది. అయితే ఈ నిబంధనలతో అటు ప్రతిపక్ష పార్టీలు హడలిపోతున్న విషయం తెలిసిందే. పోటీ చేద్దాం అనుకున్న వాళ్లు కూడా వెనకడుగు వేస్తున్నారు. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జగన్ తీసుకొచ్చిన నిర్ణయం ఎంతో అద్భుతమైనదని.. కానీ దాని ఆచరణ మాత్రం సరిగ్గా లేదు అంటున్నారు. మద్యపానం డబ్బులు పంచడం నిషేధం విధించినప్పుడు అది అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ కూడా వర్తించాలి అంటున్నారు.
కానీ జగన్ సర్కార్ తీసుకొచ్చిన నిబంధన కేవలం ప్రతిపక్ష పార్టీని ఏడిపించడానికి తీసుకొచ్చినట్లు గా ఉంది అంటూ మండిపడుతున్నారు రాజకీయవిశ్లేషకులు. తాజాగా ఓ టిడిపి అభ్యర్థి ఇంటి గోడ దూకి మరి ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద ఓ వ్యక్తి మద్యం బాటిళ్లను పెట్టడం... అప్పుడే పోలీసులు వచ్చి రైడ్ నిర్వహించి అతని అరెస్ట్ చేయడం.. ఇవన్నీ చూస్తుంటే జగన్ సర్కార్ తీసుకొచ్చిన మద్యం నిషేధం డబ్బు పంచడం నిషేధం అనే నిబంధనను కేవలం ప్రతిపక్ష పార్టీ కోసం మాత్రమేనని తమ పార్టీ కోసం కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.