ఆడవారికి వివాహం కాగానే తమ కడుపులో ఓ పండంటి బిడ్డ ఎప్పుడు పడతాడో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తన కడుపులో తన సొంత బిడ్డని తొమ్మిది నెలల పాటు మోసి తన ఇంట్లోకి ఆహ్వానించేందుకు ప్రతి స్త్రీ ఎంత ఆరాట పడుతుంటుందో మాటల్లో వర్ణించలేం. కానీ ఒక గర్భిణీ తన బిడ్డ తెలివిగా, ఆరోగ్యంగా బలంగా పుట్టాలంటే ఆ బిడ్డని తన కడుపులో మోసినన్ని రోజులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తప్పనిసరిగా తెలిసి ఉండాలి. లేకపోతే కడుపులోని బిడ్డకి చాలా హాని జరుగుతుంది. సో, తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అవేంటో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

 



కొంతమంది స్త్రీలు గర్భం దాల్చిన దగ్గర నుండి వారి కడుపు పరిమాణం మరీ పెద్దగా పెరగకుండా కొంచం లావు గానే ఉంటుంది. దాంతో చాలామంది గర్భిణీలు ఏంటి నా కడుపు ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది అని అంటుంటారు. అలా అనడం చాలా పెద్ద తప్పు. ఒకవేళ వేరే వాళ్ళు మీ గర్భాన్ని చూసి పెరగడం లేదని అంటుంటే వారికి వెంటనే దూరం అవ్వండి. అలాగే గర్భిణీ స్త్రీలకు భయం పుట్టించే వార్తలు యాక్సిడెంటు, మరణ వార్తలను చాలా నెమ్మదిగా చెప్పాలి. ఒకవేళ వెంటనే ఈ విషయాలను గర్భవతులకు తెలియపరిస్తే... వాళ్లు భయాందోళనలకు గురై డిస్టబ్ అవుతారు. మీ మానసిక పరిస్థితి పుట్టబోయే బిడ్డపై తీవ్రంగా ఉంటుంది.

 

 

ఈ విషయాన్ని పక్కన పెడితే... చాలామంది స్నేహితులు బంధువులు సన్నిహితులు గర్భంలో ఉన్నప్పుడు మీ కడుపు ని తాకవచ్చా అని అడుగుతుంటారు. ఎప్పుడో ఒకసారి అయితే తాకనివ్వచ్చుకాని తరుచుగా తాకితే కడుపులో ఉన్న బిడ్డ చాలా ఇబ్బంది పడతాడు. సైంటిఫిక్ పరంగా కూడా ఇతరులు గర్భిణీ స్త్రీ కడుపును తరచుగా తాకితే ఆ బిడ్డ కి వారి స్పర్శ తెలుస్తుంది. ఎంత మాత్రం ఇది బిడ్డకు మంచి విషయం కాదు అని చెప్పుకోవచ్చు. కేవలం తల్లి స్పర్శ మాత్రమే తన కడుపులోని బిడ్డ ఎంజాయ్ చేస్తాడు. ఇక ఈ సూచనలతో పాటు సరిగా తినడం, వేళకి పడుకోవడం లాంటివి చేస్తే బిడ్డ ఆరోగ్యకరంగా పుడతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: