పార్టీ పెట్టినప్పటి నుండి తెలుగుదేశం ఎంతటి దీనస్దితిలోకి కూరుకుపోయిందో అందరూ చూస్తున్నదే. ఏ రోజు ఏ నేత పార్టీని వదిలేస్తాడో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇప్పటికి అంటే గడచిన నాలుగు రోజులుగా మాజీమంత్రులు, మాజీ ఎంఎల్ఏలు సుమారు 10 మంది టిడిపికి రాజీనామాలు చేసి వైసిపిలో చేరిపోయారు. వైసిపిలో చేరిన వాళ్ళంతా గట్టి నాయకులు కాకపోయినా, వైసిపికి పెద్దగా ఉపయోగపడకపోయినా తెలుగుదేశంపార్టీకి అయితే నష్టమనే చెప్పాలి.
తెలుగుదేశంపార్టీకి ఇంతటి ధీనస్ధితి ఒక్కసారిగా ఎందుకు వచ్చింది ? ఎందుకంటే చంద్రబాబు స్వయంకృతమనే చెప్పాలి. ఎలాగంటే మొన్నటి ఎన్నికల్లో టిడిపికి ఘోర పరాజయం ఎదురైన విషయం తెలిసిందే. ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో వెంటనే తన స్వీయ రక్షణ కోసమని చంద్రబాబే స్వయంగా నలుగురు రాజ్యసభ ఎంపిలను గోడ దాటించేశాడు. ఇప్పటికే చంద్రబాబుపై అనేక ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
ఏదో ఓ కేసులో తనపై సిబిఐ, ఈడి, ఐటి లాంటి దర్యాప్తు సంస్ధలు విచారణకు రాకుండా అడ్డుకునేందుకు ముందుజాగ్రత్తగా సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ లాంటి వాళ్ళను చంద్రబాబే బజెపిలోకి పంపాడు. ఆ విషయాన్ని టిజి వెంకటేషే బయటపెట్టాడు. అంటే తన అవసరం కోసం, తన రక్షణ కోసం చంద్రబాబు నలుగురు ఎంపిలను బిజెపిలోకి పంపిన విషయం అందరికీ తెలిసిపోయింది.
చంద్రబాబే తన స్వార్ధం కోసం పార్టీని పణంగా పెడుతున్నపుడు తాము మాత్రం తమ స్వార్ధం ఎందుకు చూసుకోకూడదు ? అనే ఆలోచన నేతల్లో మొదలైంది. పైగా భవిష్యత్తులో టిడిపి అధికారంలోకి వస్తుందనే నమ్మకం కూడా ఎవరిలోను లేదు. అందుకనే సమయం చూసుకుని నేతలు టిడిపికి రాజీనామా చేసేసి వైసిపిలో చేరిపోతున్నారు. పార్టీ అధినాయకుడన్న వాడు మిగిలిన నేతల్లో ఆత్మస్ధైర్యం నింపాలి కానీ అందరు ముణిగిపోయినా తాను మాత్రం సేఫ్ గా ఉండాలని అనుకుంటే ఎలా ? అందుకనే ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకుంటున్నారు. పార్టీ ధీనస్ధితికి చంద్రబాబే కారణమని మీరు నమ్ముతారా ? నమ్మితే షేర్ చేయండి..గంట కొట్టండి...లైక్ కొట్టండి.