ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపేస్తున్న కరోనా  వైరస్ ఇప్పుడు దేవాలయాలకు ఈ ఎఫెక్ట్ తప్పేలే లేదు.  ఇప్పటికే ప్రముఖ దేవాలయాలు కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల ముసివేస్తున్నామని ప్రకటించారు.   షిర్డీ సాయి ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం(మార్చి 17,2020) మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది. దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు భక్తుల కోసం ప్రకటన చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆలయం మూసి వేసి ఉంటుందని వెల్లడించారు. ఆ మద్య షిరిడీ పై కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్‌ఠాక్రే ఇటీవల పర్భణీ జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు. 

 

జిల్లాలోని 'పత్రి'ని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. సీఎం ఉద్ధవ్‌ఠాక్రే నిర్ణయంపై షిర్డీలోని సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పత్రిక రాసింది. పత్రిని అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని ఆందోళన వెలిబుచ్చింది. ఇప్పుడు షిరిడీలో మరో ఇబ్బంది వచ్చి పడింది.  మహరాష్ట్రలో కరోనా ఎక్కువగా ప్రబలిపోతుందని ముందు జాగ్రత్త చర్యగా షిరిడీ ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలు సిద్ధి వినాయక, ముంబా దేవి టెంపుల్స్ ను మూసివేసిన సంగతి తెలిసిందే.

 

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో షిర్డీకి రావొద్దని భక్తులను ఇదివరకే కోరారు. షిర్డీ టూర్ ని కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. మహారాష్ట్రలో కొలువుదీరిన షిర్డీ సాయి ఆలయానికి దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. సాయిని దర్శించుకుని తరిస్తారు. కొందరు మొక్కులు చెల్లించుకుంటారు.  బాబా భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని చెప్పారు. జనాల తాకిడి అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: