ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గురించి చేసిన పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయాలు శాస్త్రవేత్తలనే షాక్ కు గురి చేస్తున్నాయి. తాజా అధ్యయనంలో ఈ వైరస్ మూడు గంటల పాటు గాల్లో సజీవంగా ఉండగలదని తేలింది. ప్లాస్టిక్ పై ఏకంగా 72 గంటల పాటు జీవించగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
కరోనా వైరస్ ఇంత వేగంగా వ్యాప్తి చెందటానికి ప్లాస్టిక్ పై అన్ని గంటల పాటు సజీవంగా ఉండగలగడమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం విజృంభించిన సార్స్ సంబంధిత లక్షణాలు కరోనాలో ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెలుగు చూసాయి. పరిశోధకులు చేసిన పరిశోధన ఫలితాలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. 
 
అట్టపెట్టెలపై 24 గంటలు, స్టీల్ పై 72 గంటలు వైరస్ జీవించగలదని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిన్నటివరకు 2,03,529 కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో ఇప్పటివరకూ 8,205 మంది మృతి చెందగా 82,107 మంది కోలుకున్నారు. భారత్ లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండగా ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. 
 
14 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ చేశారు. చైనా తరువాత ఇటలీలో భారీ సంఖ్యలో కరోనా భారీన పడి మృతి చెందుతున్నారు. మరోవైపు కరోనా వైరస్ ప్రభావం ఇటలీపై మరింత పడింది. నిన్న ఒక్కరోజులో ఇటలీలో 475 మంది మృతి చెందారు. గతంలో ఈ స్థాయిలో మరణాలు ఎక్కడా నమోదు కాలేదు. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 2,978కి చేరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకూ 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో రెండు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: