ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థిని నిర్భయను ఆరుగురు ఇనుపకడ్డీతో కొట్టి దారుణంగా అత్యాచారం చేశారు. 2012 డిసెంబర్ 16న ఈ ఘటన చోటు చేసుకుంది. 13 రోజులు మృత్యువుతో పోరాడి నిర్భయ 2012 డిసెంబర్ 9న మరణించింది. నిర్భయ తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి ఐదుగురు ప్రయాణికులు ఉన్న బస్సు ఎక్కారు. బస్సులో మద్యం తాగి ఉన్న ఐదుగురు ఆమెపై గంటకు పైగా అత్యాచారం చేసి ఆమెను, ఆమె స్నేహితుడిని బస్సు నుండి తోసేశారు. 
 
పోలీసులు ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బస్ డ్రైవర్ రామ్ సింగ్, అతని తమ్ముడు ముఖేష్ సింగ్ ను రాజస్తాన్ లో అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో జిమ్ ఇన్ స్ట్రక్టర్ వినయ్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోనే పండ్ల వ్యాపారి పవన్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. బీహార్ లోని ఔరంగాబాద్ లో అక్షయ్ ఠాకూర్ ను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఉత్తరప్రదేశ్ లోని ఆనంద్ విహర్ టెర్మినల్ లో మైనర్ బాలుడైన రాజును అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 19న నిర్భయ స్నేహితుడు నిందితులను గుర్తించడంతో పోలీసులకు వారే దోషులని నిర్ధారణ అయింది. నిర్భయ 2012 డిసెంబర్ 21న సఫ్జర్ జంగ్ ఆస్పత్రిలో ఆమె వాంగ్మూలాన్ని పోలీస్ డిప్యూటీ కమిషనర్, సబ్ డివిజనల్ న్యాయాధికారికి తెలిపారు. 
 
నిందితులను అదుపులోకి తీసుకున్న తరువాత సహచరులు తరచూ కొడుతూ ఉండటంతో ముఖేష్ సింగ్ ను ప్రత్యేక గదిలో ఉంచారు. మరో నిందితుడు పవన్ గుప్తా చేసిన నేరాన్ని అంగీకరించి తనను ఉరి తీయాలని కోరాడు. ఈరోజు ఉదయం 5.30 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలైంది. తీహార్ జైలు బయట ప్రజలు గుంపులు గుంపులుగా చేరుకుని సంబరాలు చేసుకున్నారు. దోషులకు ఉరిశిక్ష అమలుపై నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. తన కూతురు ఆత్మకు శాంతి చేకూరిందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: