కరోనా వేగంగా సంభవిస్తోంది. దేశాలు దాటి, ఖండాలు దాటి అలజడి సృష్టిస్తోంది. ప్రశాంతంగా సాగుతున్న సమయం లో భయాన్ని దింపింది. ఆనేక జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రచారాలు వింటూ పాటిస్తున్నా తీవ్రత అధికంగానే ఉంది . అతి వేగంగా మనుష్యుల ప్రాణాన్ని తీస్తోంది ఈ కరోనా భూతం. అయితే ఈ  కరోనా సోకిందో లేదో తెలుసుకోవాలంటే ఈ నిర్ధారణ పరీక్షలకి 4500 నుండి 5000 చెల్లించాలట. ఇంత ఖర్చు అవుతుంది అని తాజాగా తెలియజేసారు. 

 

అయితే ఈ టెస్ట్ కేవలం కరోనా విస్తరించిన దేశాల నుండి వచ్చిన వారికి అలానే వైరస్ నిద్ధారిత సన్నిహితులకు మరియు వారి కుటుంబ సభ్యులకి మాత్రమే ఈ పరీక్షలను చేస్తున్నారట. అయితే ఇలానే కాక ఇప్పుడు కేవలం వీటిని చెయ్యకుండా ధర్మల్ గన్ తో జ్వరాన్ని చూసి అనుమానితులని గుర్తించడానికి మార్గం అయ్యింది. అయితే అనుమానితుల పై కూడా పరీక్ష చెయ్యడం లేదుట.

 

 

దేశ వ్యాప్తంగా వచ్చిన ఈ వైరస్ అత్యంత ప్రమాదకరం. అయితే ఇప్పటికే మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. మందు ఇంకా రాలేదు అన్న  సంగతి తెలిసినదే. అయితే దేశం లో వంద లోపు ఉన్న ప్రయివేట్ ల్యాబ్ లకి మాత్రమే ఈ పరీక్ష నిర్వహించే సామర్ధ్యం ఉంది అని జి. ఎస్. కె  వేలు తెలిపారు. అయితే అధికంగా ఈ పరీక్షలు నిర్వహించడం చాలా కష్టం అంటూ చెప్పారు.

 

 

ఈ పరీక్షల్లో అత్యంత ఆధునిక పరికరాలని ఉపయోగిస్తున్నారట. భారత్ ల్యాబ్స్ జర్మనీ, అమెరికా దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాయని చెప్పారు. ప్రయివేట్ ల్యాబ్ లకి మాత్రమే ఈ పరీక్ష నిర్వహించే సామర్ధ్యం ఉంది ఒకవేళ దేశంలో అభివృద్ధి చేస్తే 500 రూపాయలతో ఈ పరీక్ష చెయ్యవచ్చుట.. అధికంగా ఈ పరీక్షలు నిర్వహించడం చాలా కష్టం అట. 

మరింత సమాచారం తెలుసుకోండి: