ఆదివారం ఏబిఎన్-ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ రాసే చె(కొ)త్తపలుకులో కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రతి ఆదివారం రాసే చెత్తపలుకులో ఎప్పటి లాగే జగన్మోహన్ రెడ్డిపై మొత్తం విషం చిమ్మేశాడు. అయితే ఆర్కె ఆయన రాసిన చెత్త పలుకులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే కమ్మోరు దిగజారిపోయారనే విషయాన్ని ఆయనే బయటపెట్టుకున్నారు. ఏ సందర్భంలో అంటే ’కమ్మవాళ్ళు ఎంతకైనా దిగజారిపోతారని చెప్పటానికే వల్లభనేని వంశీ, కరణం బలరామ్ వంటి వారిని పార్టీలో చేర్చుకున్నా’మని వైసిపిలోని ఓ రెడ్డి నాయకుడు వేమూరికి చెప్పాడట.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిజంగానే కమ్మోళ్ళు ఎంతకైనా దిగజారిపోతారో లేదో తెలీదు. కమ్మోరు ఎంతకైనా దిగజారిపోతారనే ప్రచారం జరుగుతోందంటే వేమూరి లాంటి వాళ్ళే కారణం. ఎలాగంటే వల్లభనేని, కరణం ఇంత వరకూ వైసిపిలో చేరలేదు. చంద్రబాబునాయుడుతో విభేదాల వల్లే వంశీ టిడిపిలో ఇమడలేనని ఆయనే చెప్పాడు. ఇదే విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ తో చెప్పి ఇండిపెండెంట్ గా గుర్తించి వేరే సీటు కేటాయించమని అడిగాడు.
ఇక కరణం సంగతి చూస్తే ఆయన కొడుకు వెంకటేష్ వైసిపిలో చేరాడే కానీ బలరామ్ చేరలేదు. ఇప్పటికీ టిడిపిలోనే ఉన్నాడన్న విషయం అందిరికీ తెలుసు. వీళ్ళిద్దరూ వైసిపిలో చేరకుండానే చేరిపోయినట్లు వేమూరికి చెప్పిన ఆ వైసిపిలో రెడ్డి నేత ఎవరో ? ఒక రెడ్డి నేత చెప్పాడు, ఓ ఎంఎల్ఏ చెప్పాడు, వైసిపిలోని ఓ సీనియర్ నేత చెప్పాడని రాధాకృష్ణ రాస్తున్న చెత్త రాతలకు ఎప్పుడో కాలం చెల్లిపోయాయి. నిజానికి కమ్మ సామాజికవర్గం మీద మిగిలిన జనాల్లో వ్యతిరేకత పెరిగింది జగన్ వల్ల కాదు.
నిజానికి రాష్ట్రంలో కమ్మోళ్ళ మీద మిగిలిన వాళ్ళకు అలాంటి వ్యతిరేకత ఏమైనా ఉంటే దానికి చంద్రబాబు, రాధాకృష్ణ, టిడిపి హయాంలో విపరీతమైన అధికారాలను అనుభవించిన కొందరు కమ్మోళ్ళ వల్లే వచ్చింది. జగన్ ప్రభుత్వం ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపిపిఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్, ఇంటెలిజెన్స్ మాజీ డిపి ఏబి వెంకటేశ్వరరావు, ఎన్జీ రంగా వైస్ ఛాన్సలర్ దామోదర్ నాయుడు లాంటి వాళ్ళను వేధిస్తున్నట్లు రాశాడు. నిమ్మగడ్డను మినహాయిస్తే మిగిలిన ముగ్గురు చంద్రబాబు అండ చూసుకునే అప్పట్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ఇపుడు ఫలితం అనుభవిస్తున్నారంతే. కాబట్టి కమ్మోరికి ఏదైనా నష్టం జరుగుతోందంటే అందుకు వేమూరి లాంటి వాళ్ళదే ఎక్కువ బాధ్యత.