క‌రోనా తెలంగాణ‌లో గంట గంట‌కు రెచ్చిపోతోంది. తెలంగాణ ప్ర‌భుత్వంతో పాటు అధికార యంత్రాంగం ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటున్నా క‌రోనాకు మాత్రం బ్రేకులు వేయ‌లేక‌పోతున్నారు. తాజాగా ఆదివారం తెలంగాణ‌లో జ‌న‌తా క‌ర్ఫ్యూ సూప‌ర్ హిట్ అయ్యింది. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంతో పాటు తెలంగాణ‌లోని అన్ని ప్రధాన న‌గ‌రాల్లోనూ జ‌న‌తా క‌ర్ఫ్యూ స‌క్సెస్ అయ్యింది. అయితే సోమ‌వారం మ‌ళ్లీ తెలంగాణ‌ను హ‌డ‌లెత్తించే న్యూస్ వ‌చ్చేసింది. సోమ‌వారం ఒక్క రోజే మూడు కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవ్వ‌డంతో ఈ కౌంట్ 30కు చేరుకుంది.

 

విదేశాల నుంచి వ‌చ్చిన మ‌రో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ సోకింది. ఇక వీరిలో లండ‌న్ నుంచి వ‌చ్చిన ఓ వ్య‌క్తికి క‌రోనా సోకింది. ఇక క‌రోనా బాగా ఆందోళ‌న‌కు గురి చేస్తోన్న క‌రీంన‌గ‌ర్‌లో మ‌రో పాజిటివ్ కేసు న‌మోదు అయ్యింది. క‌రీంన‌గ‌ర్‌కు చెందిన ఓ యువ‌కుడికి క‌రోనా పాజిటివ్ గుర్తింపు జ‌రిగింది. స‌ద‌రు యువ‌కుడు ఇండోనేషియా నుంచి వ‌చ్చిన వారితో తిర‌గ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఏదేమైనా సోమ‌వారం ఒక్క రోజే తెలంగాణ‌లో మూడు కొత్త కేసులు రావ‌డంతో పాటు ఈ కౌంట్ ఏకంగా 30కు చేర‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. ఏదేమైనా ఇండోనేషియ‌న్ల నుంచే క‌రీంన‌గ‌ర్‌లో ఎక్క‌వ కేసులు వ‌స్తున్న‌ట్టు అనుమానాలు వ‌స్తున్నాయి.

 

ఇక ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ విజృంభ‌న‌తో కేసీఆర్ లాక్ డౌన్ ప్ర‌క‌టించి ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు ప్ర‌క‌టించారు. అన్ని సంస్థ‌ల్లో ప‌ని చేస్తోన్న ఉద్యోగుల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. చాలా మంది లాక్ డౌన్ బ్రేక్ చేసి ఇష్ట‌మొచ్చిన‌ట్టు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అంద‌రిలోనూ ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు కూడా వైద్య మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌త్యేక ఐసోలేష‌న్ వార్డులు ఏర్పాటు చేసి క‌రోనా బాధితుల‌కు వైద్యం అందించాల‌ని సూచించారు. ఏదేమైనా ఈ కౌంట్ ఇక్క‌డితో ఆగుతుందా ?  లేదా ?  పెరుగుతుందా ? అన్న టెన్ష‌న్ మామూలుగా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: