క‌రోనా వైర‌స్ ఎంత ప‌ని చేసింది ?  దేవుడా ?  మాకు ఎన్ని క‌ష్టాలురా ? అని బాబు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు విల‌విల్లాడి పోతున్నారు. ఎక్క‌డో చైనాలోని వుహాన్ న‌గ‌రంలో ఈ వైర‌స్ పుట్ట‌డం ఏంటి ?  మొత్తం ప్ర‌పంచాన్ని అత‌లా కుత‌లం చేయ‌డం ఏంట్రా బాబు అన్న‌ది ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. క‌రోనా దెబ్బ‌తో మ‌హా మ‌హా ప్ర‌పంచ‌లోని అగ్ర దేశాలే వ‌ణికి పోతోన్న ప‌రిస్థితి. ఇక మ‌న భార‌త దేశం ఈ వైర‌స్ విష‌యంలో ముందు నుంచి ఎలెర్ట్‌గా నే ఉన్నా ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చే వారి విష‌యంలో ముందుగా కాస్త అల‌సత్వంలో ఉండ‌డంతో ఇప్పుడు విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్ల ద్వారా ఈ వైర‌స్ అంద‌రికి వ్యాప్తి చెందుతోంది.



ఇక సోమ‌వారం నుంచి ఈ వైర‌స్ తెలంగాణ‌లో మ‌రింత విజృంభిస్తోంది. సోమ‌వారం ఒక్క రోజే తెలంగాణ‌లో ఏకంగా ఆరుగురికి పాజిటివ్ సోకిన‌ట్టు నిర్దారించారు. దీంతో తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా సోకిన వారి సంఖ్య 33కు చేరుకుంది. ఇదిలా ఉంటే అన్ని కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం ఇవ్వ‌డంతో తెలంగాణ నుంచి భారీ ఎత్తున ఆంధ్రాలోని త‌మ ప్రాంతాల‌కు వెళ్లి పోతున్నారు. అదే టైంలో ఏపీలో పెళ్లిల్లు ఉన్న వాళ్లు సైతం కార్లు.. ఇత‌ర ర‌వాణా వాహ‌నాల ద్వారా ఆంధ్రాకు బ‌య‌లు దేరారు.



ఇక ఇటు ఏపీ నుంచి కూడా చాలా మంది తెలంగాణ‌కు బ‌య‌లు దేరారు. అయితే అటు తెలంగాణ నుంచి ఏపీకి వ‌స్తున్న వారిని.. ఇటు ఏపీ నుంచి తెలంగాణ‌కు వెళుతోన్న వారిని కోదాడ చెక్ పోస్టు ద‌గ్గ‌ర ఏపీ, తెలంగాణ పోలీసులు పోటీలు ప‌డి మ‌రి ఆపేస్తున్నారు. దీంతో చివ‌ర‌కు అక్క‌డ ఉద‌యం నుంచి ఆగిపోతోన్న ప్ర‌యాణికులు మంచినీళ్లు కూడా లేక విల‌విల్లాడుతున్నారు. వీరి బాధ‌లు ప‌ట్టించుకున్న వారే లేరు. అయితే మ‌రి అత్య‌వ‌స‌రం అయిన వారిని మాత్ర‌మే వెళ్లేందుకు అనుమ‌తి ఇస్తున్నారు. దీంతో వాళ్లంతా ఇదేం కారోనా రా బాబు మా ప్రాణాల మీద‌కు తెచ్చింది అని వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: