కరోనా వైరస్ మహమ్మారి భూమి మీద రోజురోజుకి వీరంగం చేస్తోంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం భూమి మీద ఉన్న పేద వాడిని మరియు ఐశ్వర్యవంతుడునీ ఇంటికి పరిమితం చేసింది. నాకు అందరూ సమానమే అన్నట్టు భూమి మీద మరణ తాండవం చేస్తుంది. భారతదేశంలో కూడా ఉన్న కొద్దీ ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ విధించడం జరిగింది. దీంతో భారత దేశం మొత్తం షట్ డౌన్ అయింది. చాలా వరకు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ చేయడం జరిగింది. జనసాంద్రత ఎక్కువగా మరియు షాపింగ్ మాల్స్ అదేవిధంగా సినిమా హాల్స్ ఎక్కువగా ఉండే చోట ఈ వైరస్ ప్రభావం గట్టిగా ఉండటంతో దేశ ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

ముఖ్యంగా ఇటలీ మరియు చైనాలో వైరస్ వల్ల మనుషులు చనిపోవడానికి కారణం చూస్తే వైద్య సదుపాయం లేక పోవటం అదేవిధంగా దీనికి మందు లేకపోవటం. దీంతో మనుషులను చాలావరకు కట్టడి చేస్తే వైరస్ ని అదుపులోకి తీసుకు వచ్చి….చాలా వరకు అరికట్టవచ్చు అంటూ భూమి మీద ఉన్న రాజకీయ నేతలు ఎవరికి వారు...తమ దేశానికి చెందిన ప్రజలను బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రపంచ ధనవంతులలో ఒకరు, దేశంలో నెంబర్ వన్ ధనవంతుడు రిలయన్స్ అంబానీ కరోనా విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 

రిలయన్స్ సంస్థ తరఫున రోజుకి లక్ష ఫేస్ మాస్కులు పంచాలని డిసైడ్ అయినట్లు, అదేవిధంగా ఏ ఏ పట్టణాలలో వైరస్ బాధితులు ఉన్నారో ఆయ పట్టణాలలో రోగులకు ఉచిత భోజనం కల్పించాలని డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా పేదవారికి కూడా ఉచిత భోజనం కల్పించడానికి ముందుకు రావడం జరిగింది. వైరస్ రోగులను తరలించే ఆంబులెన్స్ లకు ఫ్రీగా పెట్రోల్ మరియు డీజిల్ ఇవ్వటానికి ముందుకు వచ్చారు. మొత్తం మీద దేశ ధనవంతుడు రిలయన్స్ అంబానీ చేస్తున్న ఈ సాయానికి సోషల్ మీడియాలో నెటిజన్లు చేతులెత్తి దండం పెడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: