ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వార్తలు వచ్చాయి. కానీ కొంతసేపటికే పరిస్థితి మారిపోయింది. నిన్న ఏపీలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తెలంగాణలో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 41కు చేరగా ఏపీలో 10కు చేరింది. 
 
ఇరు రాష్ట్రాల సీఎంలు కఠిన చర్యలు చేపడుతున్నా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తెలంగాణలో నిన్న రాత్రి మూడేళ్ల బాలుడు, ఒక మహిళకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. గోల్కొండ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం కొన్ని రోజుల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చింది. బాలుడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్చగా కరోనా పాజిటివ్ అని తేలింది. కొద్ది రోజుల క్రితం లండన్ నుండి కోకాపేటకు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలగా ఆయన భార్యకు కూడా కరోనా సోకిందని నిర్ధారణ అయింది.రాష్ట్రంలో ఆరు కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయి. 
 
ఏపీలోని గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13 మంది కరోనా అనుమానితుల నివేదికలు ఇంకా అందాల్సి ఉంది. 20వ తేదీన వాషింగ్టన్ నుంచి విజయవాడకు వచ్చిన యువకుడు కరోనా లక్షణాలతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 
 
ఈ నెల 18న ఢిల్లీ నుంచి గుంటూరుకు చేరుకున్న ఒక వ్యక్తి కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ నిన్న రాత్రి ఈ వివరాలను ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ 289 మందికి కరోనా పరీక్షలను నిర్వహించింది. మోదీ లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: