దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 649కు చేరింది. నిన్న ఒక్కరోజే 42 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా భారీన పడి ఇప్పటికే 21,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 5 లక్షల మంది కరోనా భారీన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 198 దేశాలకు విస్తరించిన విషయం తెలిసిందే. కరోనాకు మందులు లేకపోవడంతో రోజురోజుకు మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 
 
తాజాగా చైనాలో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ఔషధ పరీక్షలను చూస్తే ఈ వార్త నిజమేనని నమ్మాల్సి వస్తోంది. చైనాలోని శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి కరోనాకు వ్యాక్సిన్ ను కనిపెట్టారని సమాచారం. శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ ను 5,000 మందిపై తొలి దశలో ప్రయోగించనున్నారు. చైనాలోని ఒక న్యూస్ ఛానల్ తెలిపిన వివరాల ప్రకారం 5,000 మంది ఇందుకోసం రిజిష్టర్ చేసుకున్నారని తెలుస్తోంది. 
 
18 - 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారని సమాచారం. కొన్ని రోజుల క్రితం చైనా ప్రభుత్వం అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ నిపుణులకు క్లినికల్ ట్రయల్స్ కొరకు అనుమతులు ఇచ్చిందని సమాచారం. రాబోయే ఆరు నెలలు ఈ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయని తెలుస్తోంది. వుహాన్ లోనే ఈ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయని సమాచారం. 

క్లినికల్ ట్రయల్స్ కు రిజిష్టర్ చేసుకున్న వారిని వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఇతర దేశాల్లో కూడా కరోనాకు మందు కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండటంలో ప్రజల్లో టెన్షన్ నెలకొంది. తెలంగాణలో ఇప్పటివరకూ 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 10 కేసులు నమోదయ్యాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple 

మరింత సమాచారం తెలుసుకోండి: