రోజు రోజుకి కామాంధుల అకృత్యాలు ఎక్కువవుతున్నాయి. వావి వరుసలు లేకుండా ఎలాంటి దారుణానికైనా ఒడికడుతున్నారు. తన మనవరాలు వయసున్న బాలిక పై కన్నేసిన ఓ వృద్ధుడు ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ బాలికను లొంగదీసుకున్నాడు. పలుమార్లు ఆమెను లొంగదీసుకోవటంతో ఆ చిన్నారి బాలిక గర్భం దాల్చింది. అందరి చిన్నారులతో కలిసి ఆడుకునే వయసులో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది ఆ బాలిక.
ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. నామక్కల్ పరిధిలోని నామగిరి పెట్టై ప్రాంతంలో తన తల్లితో కలిసి ఉంటుంది. తల్లి కూలి పనులు చేసుకుంటూ ఓ వైపు జీవనం సాగిస్తూ మరోవైపు తన కూతురిని చదివిస్తోంది. ఆ బాలిక స్థానిక పాఠశాలలో ఇంటర్ మీడియేట్ చదువుతోంది. ఆ బాలిక తండ్రి ఐదేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించాడు. ఈ నేపథ్యంలోనే ఈ బాలిక నివాసం ఉంటున్న ఇంటి పక్కనే డెబ్భై ఏళ్ళ వృద్ధుడు ( వీరన్ ) నివాసం ఉంటున్నాడు. వీరన్ కన్ను ఆ బాలిక పై పడింది. బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు వీరన్. అలా లొంగదీసుకుని ఆమె పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది. అయితే.. ఫైనల్ ఎగ్జామ్స్ కు హాజరవుతున్న తరుణంలో ఎక్సమ్ హాల్ కి వెళ్లిన బాలికకు కడుపునొప్పి రావటంతో బాత్రూం కి వెళ్ళింది. ఎంతసేపటికి ఆ బాలిక రాకపోవటంతో అనుమానం వచ్చిన టీచర్ టాయిలెట్స్ కి వెళ్లి చూసి షాక్ కి గురయింది. అక్కడ ఆ బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఏం చేయాలో అర్ధం కాక వెంటనే ఈ విషయాన్నీ హెచ్ఎం కి చేరవేసింది. స్పందించిన ప్రధానోపాధ్యాయురాలు వెంటనే ఆ బాలికను సేలంలోని మోహన్ కుమారమంగళం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆ బాలికను పరీక్షించిన వైద్యులు షాక్ అయ్యారు. అప్పటికి ఆ బాలికకు ఎనిమిది నెలలు నిండాయని వెంటనే ఆ బాలికకు తీవ్ర రక్తస్రావం కావటంతో వెంటనే వైద్యులు ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు పోతాయని చెప్పారు. ఈ విషయం విని ఏం చేయాలో తెలియక ఆపరేషన్ చేయమని చెప్పటంతో ఆపరేషన్ చేసి ఆడబిడ్డను బయటకు తీశారు. అనంతరం అసలు విషయం ఏంటని ఆ బాలికను ఆరా తీయడంతో విషయం మొత్తం చెప్పింది. దీంతో ఆ బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరన్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ దారుణాన్ని అంగీకరించటంతో జైలుకి పంపినట్టు పోలీసులు తెలిపారు.