కరోనా.. కరోనా.. కరోనా.. కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. కరోనా భయంతో ఊరూవాడా వణికిపోతున్నాయి. ఎటు నుంచి వచ్చి ఎవడు కరోనా అంటిస్తాడో అని హడలి చస్తున్నారు జనం. కరోనా చావు కుక్క చావు కంటే దారుణంగా ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా టాపిక్ మాత్రం కరోనానే అవుతోంది.
అయితే ఇలాంటి సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదేంటంటే... ఇప్పటి వరకూ దాదాపు 5 లక్షల మందికి కరోనా సోకితే.. దాదాపు లక్ష మంది కరోనా నుంచి కోలుకున్నారు. అంటే కరోనా వచ్చిందంటే మరణమే అన్న భయం అవసరం లేదు. 5 లక్షల మందిలో మృతుల సంఖ్య 25 వేల వరకూ మాత్రమే ఉంది. అంటే వంద మందిలో కరోనా వస్తే చనిపోయేది ఒక్కడు మాత్రమే అన్నమాట. కాబట్టి కరోనా అంటే చావే అన్న భయం అవసరం లేదు.
మరో విషయం కరోనాకు వ్యాక్సీన్ ఇప్పటి వరకూ కనిపెట్టలేదన్నది వాస్తవమే. దీనివల్ల కూడా ఆందోళన పెరుగుతోంది. అయితే మందు కనుక్కునే దిశగా వేగంగా జరుగుతున్న పరిశోధనలు ఊరట కలిగిస్తున్నాయి. కరోనాను హైడ్రాక్సీ క్లోరోక్విన్ సమర్థంగా పనిచేస్తుందని ఇటీవల ఐసీఎంఆర్ ప్రకటించింది. ఈ మందు కరోనా సోకక ముందే ముందు జాగ్రత్తగా వేసుకోవచ్చు.
కరోనాకు మందు కనిపెట్టే అంశం కూడా చురుగ్గానే సాగుతోంది. దాదాపు 50ఏళ్లుగా వ్యాక్సిన్ల తయారీలో పేరున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వైరస్ వ్యాధికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనులు ప్రారంభించింది. అంతే కాదు.. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకుంది. అంటే త్వరలోనే వాక్సీన్ అందుబాటులోకి వస్తుందన్నమాట. కరోనా పాజిటివ్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి పాజిటివ్ అంశాలు కూడా చాలా ఉన్నాయి.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
https://tinyurl.com/NIHWNgoogle
https://tinyurl.com/NIHWNapple