
దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. వాటిలో కొన్ని వార్తలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొందరు కరోనా సోకకపోయినా ఒకటి, రెండు లక్షణాలు కనిపిస్తే చాలు విపరీతమైన భయాందోళనకు గురవుతున్నారు. చాలా మంది ప్రజలు ఇంటి నుండి కాలు బయటపెట్టాలంటే కూడా భయాందోళనకు గురవుతున్నారు.
తాజాగా కరోనా సోకిందన్న అనుమానంతో తూర్పుగోదావరి జిల్లాలో భార్యాభర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యం, ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు కరోనా సోకిందన్న అనుమానం దంపతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. ఆటోడ్రైవర్ రాజేష్, అతని భార్య వెంకట లక్ష్మి నిన్న అర్ధరాత్రి సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని సజీవదహనమయ్యారు.
రాజేష్, వెంకట లక్ష్మికి 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇప్పటివరకూ సంతానం కలగలేదు. గత కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉండటంతో దంపతులు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్తచర్యలు చేపడుతోంది. కానీ కొందరు కరోనాపై సరైన అవగాహన లేకపోవడంతో తీవ్ర భయాందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా సోకిందన్న అనుమానంతో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం కరోనా గురించి సరైన రీతిలో అవగాహన కల్పించి ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple