జగన్ అంటే ఏపీలో రాజకీయ పార్టీలు ముఖం చిట్లిస్తాయి. ఆయన్ని ఇంకా పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చిన వారిగానే చూస్తాయి. ఆయనకు వెల్లువెత్తిన ప్రజాభిమానాన్ని కూడా తక్కువ చేసి చూస్తాయి. ఇక జగన్ పాలన విషయంలో కూడా అన్నీ  తప్పులే చూస్తూ మంచి పనులను పక్కన పెడుతూంటాయి. ఇదంతా ఫక్త్  రాజకీయం

 

అయితే జగన్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ఇతర రాష్ట్రాల్నిని ముఖ్యమంత్రులు ఇంతవరకూ అనుసరిస్తూ రావడం అంతా చూసారు. రాజధానుల వికేంద్రీకరణ కానీ, ఇంగ్లీష్ మీడియం సర్కార్ బడుల్లో ప్రవేశ పెట్టే ప్రతిపాదన కానీ, దిశ చట్టం అమలు కానీ జగన్ విషయంలో ఇతర సీఎంల ఆసక్తి ఎక్కువగా ఉంది.

 

ఇపుడు దేశం కాని దేశంలో కూడా జగన్ కి జై అంటున్న పరిస్థితి ఉంది. జగన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇపుడు బ్రిటన్ దేశాన్ని ఆకట్టుకుందని అంటున్నారు. జగన్ గత ఏడాది ఆగస్ట్ 15 నుంచి ఏపీవ్యాప్తంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొత్తం రెండు లక్షల యాబై వేల మంది నిరుద్యోగులకు  ఆ విధంగా జగన్ అండగా నిలిచి కొలువులు ఇచ్చారు.

 

ఇపుడు వారే జగన్ కి మంచి టీం గా మారి గ్రామల్లో చాలా యాక్టివ్ గా  పనిచేస్తున్నారు. నిజంగా ఒక సైనికుని మాదిరిగా వారంతా పనిచేస్తున్నారు. వారి వల్లనే కరోనా వైరస్ విస్తరించకుండా జగన్ సత్వరమే చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ ప్రతీ ఇంటిని జల్లెడ పట్టి వాలంటీర్లు చేస్తున్న సేవ చాలా కీలకమైనది అని చెప్పాలి.

 

ఇపుడు కరోనా వైరస్ టైంలో వారి విలువ ఏంటో అందరికీ ఇంకా బాగా అర్ధమైంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు అయితే జగం టీం భేష్ అంటున్నారు. ఇపుడు కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో బ్రిటన్ దేశం కూడా హఠాత్తుగా రెండున్నర లక్షల‌ మంది వాలంటీర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

 

అంటే ఏపీలో వాలంటీర్ల పనితనం బహుశా బ్రిటన్ కి కూడా అర్ధం అయిందంట్లుంది. దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ జగన్ గ్రేట్ అన్నారు. ఆయన ముందు చూపు వల్లనే ఇపుడు ఏపీలో కరోనా కట్టడికి అన్ని రకాలైన చర్యలు తీసుకోగలిగామని అంటున్నారు. ఇక మరో వైపు చూసుకుంటే బ్రిటన్ వంటి దేశాలు జగన్ విధానాలు అనుసరించడం గర్వకారణమని కూడా విజయసాయిరెడ్డి అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: