ప్రపంచానికి చీడ పురుగులా దాపురించిన కరోనా వైరస్‌ నివారణకు ప్రాంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, సామాన్యులు దాతలుగా మారుతున్న విషయం అందరికి తెలిసినదే. అలాగే మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరూ తమకు ఉన్నంతలో తోచినంత విరాళాలు ప్రకటిస్తున్న వార్తలు మనం చూస్తూనే వున్నాం. ఇపుడు తాజాగా అదే వరుసలోకి వచ్చి చేరారు... సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఉద్యోగులు... అధికారులు.

 

వారంతా తమ ఒక్కరోజు వేతనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయాలని అనుకోవడం హర్షించ దగ్గ విషయం. వారి ఒక్కరోజు కరువు జీత భత్యాన్ని, సీఎం సహాయనిధికి చెల్లించాలని, కలిసికట్టుగా వారు సంస్థ యాజమాన్యానికి విజ్ఞప్తి చేయగా, సదరు అధికారి అధికారిక ప్రకటన విడుదల చేసారు. ఇక అక్కడ ఎంప్లోయ్ మెంట్ ని పరిశీలించినట్లయితే...  2,400 మంది అధికారులు.. 47 వేల మంది కార్మికులు అక్కడ సేవలు అందిస్తున్నారు.

 

ఇక వారి ఒక రోజు మూలవేతనంను ఒకసారి లెక్కేసుకుంటే... అధికారులది  రూ.కోటి, కార్మికుల కరువు భత్యం రూ.7 కోట్ల 50 లక్షలను మొత్తంగా సీఎం సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. అధికారులు, కార్మికుల వితరణ కలిపి మొత్తం రూ.8.50 కోట్ల చెక్కును త్వరలో సీఎం కేసీఆర్‌కు  అధికారికంగా ఇవ్వనున్నారు. ఇక సింగరేణి ఉద్యోగుల ఉదార స్వభావం గురించి అందరికి తెలిసినదే.

 

ఇక పొతే, ప్రకృతి వైపరీత్యం కారణంగా... మన దేశంలోని పలు ప్రదేశాల్లో అప్పుడప్పుడు సంభవించిన విపత్తుల వలన జరిగిన భారీ నష్టాలకు సింగరేణి సంస్థ చేసిన ధన సేవ గురించి మనం ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. విద్యుత్‌ ఉత్పత్తి కంపినీలకు ఎటువంటి బొగ్గు కొరత లేకుండా.. సింగరేణి ఉద్యోగులు నిరంతరం... పనిచేస్తున్న సేవలను ఆ సంస్థ ఎండీ ఎన్‌. శ్రీధర్‌ కొనియాడారు. వారి బాధ్యతగా, తమ పరిసరాలలో ప్రతి గని కార్మిక కాలనీల్లో, ఆస్పత్రుల్లో, కరోనా వ్యాప్తి నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: