కరోనా వైరస్ అంతకంతకూ పెచ్చు మీరి, ప్రపంచ దేశాలన్నిటికి వ్యాపిస్తోంది. ఇక్కడ ఘోరమైన విషయం పరిశీలించినట్లయితే.. దీన్ని ముందే.. అరికట్టాల్సిన చైనా, కరోనా  మహమ్మారిని రహస్యంగా ఉంచాలనుకుంది... విపత్కర పరిస్థితుల్లో కూడా.. చైనా రహస్య పద్ధతుల్లోనే వ్యవహరించిందే తప్ప, బాధ్యతగా పనిచేయలేదు. సమాచారాన్ని సరిగ్గా బయలు పరచలేదు. దీనివల్ల మొదట్లో, ప్రజల్లో అనుకున్నంత అవగాహన ఏర్పడలేదు. 

 

పలువురు రాజకీయ ఉద్ధండులు విశ్లేషించినట్లు, ప్రపంచం ముందు రాజకీయంగా చులకనైపోతామన్న భయంతో... చైనా గోప్యతను పాటించిందని ఇపుడు అందరి నోటా వినిపిస్తోంది. దానికి చైనాలో వున్న ప్రస్తుత పరిస్థితులే అనుమానాలను రేకిత్తిస్తున్నాయి. జరిగిన 75 రోజుల కరోనా పీరియడ్ ను గమనించినట్లయితే, చైనాలో పుట్టిన కరోనా అక్కడ యెంత వేగంగా వ్యాపించిందో.. అంతే వేగంగా నివారించబడింది.

 

అక్కడ 85000 బాధితులకు... 3000 మంది మరణించగా... మిగిలినవారు కోరుకున్నారు. ప్రస్తుత వుహాన్ నగర పరిస్థితి బాగానే వుంది... అక్కడ ప్రజలు యధావిధిగా జీవిస్తున్నారు. కానీ, కరోనా బారిన పడి ప్రపంచం  విలవిలలాడుతోంది. ఈ స్థితికి కారణం కేవలం చైనాయే అని చెబుతున్నారు ప్రముఖులు. మరికిందరు కొంచెం ముందగువేసి, "కరోనా వైరస్ తో.. చైనా, బయో వార్ మొదలుపెట్టిందని" చెబుతున్నారు.

 

ఇందులో నిజానిజాలు దేవుడికెరుక గాని.. లోతుగా ఆలోచిస్తే మాత్రం... నిజమనే అనిపిస్తోంది. ఎందుకంటే ఇపుడు కరోనా రుగ్మతతో బాధపడుతున్న దేశాలన్నీ... చైనాకు శత్రు దేశాలే మరి! అందులో మనం కూడా వున్నామనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అలాగే దీన్ని మొదటగా కనుగొన్న డాక్టర్ లీ నోటిని నొక్కే ప్రయత్నం చేసింది అక్కడి ప్రభుత్వం. 2019 చివరి రోజుల్లో, డాక్టర్ లీ మెసేజ్ బయటకొచ్చిన తర్వాత,  పరిస్థితిని కంట్రోల్ చేయడానికి అధికారులు యత్నించారు... కానీ అక్కడ జరిగిన విషయాన్ని నచ్చినట్లు వక్రీకరించారు. ప్రజలను.. ప్రపంచ దేశాలను నమ్మించే ప్రయత్నం చేసి, కరోనా విష ప్రయోగానికి బలి చేశారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: