ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. అయితే.. ఇదిలా ఉండగా చైనా నుంచి వచ్చిన వ్యక్తి సామాన్య ప్రజల్లో దడపుట్టిస్తున్నాడు. అదెలా అనుకుంటున్నారా..?? ఇటీవల ఒక వ్యక్తి చైనా దేశం నుంచి భారత్ కు వచ్చాడు. కాగా., ఆ వ్యక్తిని అధికారులు హోం క్వారంటైన్ లో ఉండమని ఆదేశించారు. అయితే.. అతను అధికారుల ఆదేశాలను లెక్కచెయ్యకుండా హోం క్వారంటైన్ అధికారుల కళ్లు కప్పి అనేక ఊర్లు తిరిగి స్థానిక ప్రజలకు నిద్ర లేకుండా చేశాడు. ఈ వ్యక్తి మీద పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. 

 

అసలు ఈ వ్యక్తికీ కరోనా వచ్చిందా లేదా..?? అనేది తెలీదు. ఆ వ్యక్తి పలు ప్రాంతాల్లో హల్ చల్ చేశాడు. చివరికి కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో చైనా నుంచి వచ్చిన వ్యక్తి కలకలం రేపాడు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికారుల కళ్లు కప్పి క్వారంటైన్ నుంచి తప్పించుకుని పలు ప్రాంతాల్లో సంచరించి ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడాడు. హోసనగర నివాసి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

చైనా నుంచి వచ్చిన హోసనగర నివాసికి ఎయిర్ పోర్టులో కరోనా వైరస్ కు సంబంధించిన వైద్యపరీక్షలు నిర్వహించారు. క్లారిటీగా తెలవకముందే పరారయ్యాడు. ఇది తెలుసుకున్న అధికారులు మార్చి 19వ తేదీ నుంచి ఎప్రిల్ 4వ తేదీ వరకు ఇంటిలోని క్వారెంటైన్ లో ఉండాలని శివమొగ్గ జిల్లా అధికారులు అతనికి సూచించారు. కానీ అతను ఆదేశాలను లెక్క చేయకుండా తప్పించుకుని బజార్లపొంటి చక్కర్లు కొట్టాడు. ఇక ఆ వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడో, ఎవరిని కలుసుకున్నాడో తెలియడం లేదని తెలుసుకున్న అధికారులు షాక్ కు గురైనాడు. 

 

అయితే.. అధికారులు, వైద్యులు పరీక్షలు చెయ్యడానికి హోసనగరలోని అంబేద్కర్ కాలనీలోని అతనికి ఇంటికి వెళ్లారు. ఇప్పుడితను ఎక్కడికి వెళ్ళదంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చైనా నుంచి వచ్చిన వ్యక్తిని పట్టుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. అనంతరం అతన్ని ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నామని జిల్లా అధికారులు తెలిపారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: