రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈరోజు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 58కు చేరింది. మరికొన్ని జిల్లాలలో కరోనా పరీక్షలకు సంబంధించిన నివేదికలు అందాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
రాష్ట్రంలో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి, ఇతర అవసరాల కోసం బయటకు వస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు బయటకు వస్తూ ఉండటంతో ప్రభుత్వం ఇళ్లకే నిత్యావసర వస్తువులు, కూరగాయలు సరఫరా చేసేందుకు ప్రణాళిక వేస్తోంది. ఈరోజు ప్రభుత్వం నుంచి ఇళ్లకే నిత్యావసర వస్తువులు, కూరగాయల పంపిణీ గురించి అధికారికంగా ప్రకటన రానుందని సమాచారం.
ప్రభుత్వం ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యే విధంగా నిబంధనలలో భారీ మార్పులు చేయనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తే మాత్రమే కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులకు, పోలీసులకు నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారికే ఎక్కువగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతూ ఉండటం గమనార్హం.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లిన వారు, వారితో సన్నిహితంగా ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చికిత్స తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైద్యం తీసుకుంటే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని... లేదంటే వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకే అవకాశం ఉందని హెచ్చరించారు. సీఎం ఢిల్లీ నిజాముద్దీన్ సదస్సులో జమాత్ సదస్సుకు హాజరైన వారందరినీ క్వారంటైన్ కు తరలించారని ఆదేశించారు. అధికారులు ఇప్పటికే జమాత్ నిర్వహకులు, రైల్వే శాఖ ద్వారా మత ప్రార్థనలకు హాజరైన వారి వివరాలను సేకరించారని సమాచారం.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple