ప్రకృతి అందాలకే కాదు... గలగలా పారే సెలయేళ్ళు, గోదావరి నది, పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఉభయగోదావరి జిల్లాల్లో ఇప్పుడు ఒకటే వణుకు కనిపిస్తోంది. ఇప్పటివరకు కరోనా వైరస్ ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నా ఆ ప్రభావం భారత దేశం మీద పెద్దగా లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి అంతంత మాత్రంగానే ఉండడంతో ఎటువంటి ఇబ్బంది లేదు అని ఊపిరి పీల్చుకున్నాయి. అయితే అనుకోకుండా కరోనా మహమ్మారి ప్రభావం తూర్పు, పశ్చిమ గోదావరి రెండు జిల్లాలపై ఎక్కువగా పడడంతో ఎక్కడలేని ఆందోళన పెరిగిపోతోంది. రాష్ట్రంలో కరోనా ప్రభావం తొలిదశలో ఉండగానే తూర్పుగోదావరి జిల్లా లో విదేశాలకు చదువుకోవడానికి వెళ్లి వచ్చిన వ్యక్తికి తొలి కరోనా పాజిటివ్ కేసు గా రికార్డ్ అయినప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది.

 

IHG's the Damage <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CORONAVIRUS' target='_blank' title='coronavirus-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>coronavirus</a> (COVID-19) Can Do to Your Lungs ...


 ఇక అప్పటి నుంచి జిల్లాలో వారం పాటు మరో కేసు మాత్రమే నమోదు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్న దశలో ఢిల్లీకి మత ప్రార్ధనలకు వెళ్లిన వారిలో కరోనా లక్షణాలు బయటపడటంతో జిల్లా వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా లో మొత్తం నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అకస్మాత్తుగా ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వల్ల కరోనా కేసుల సంఖ్య ఎక్కువ అయ్యింది. కాకినాడ నుంచి నలుగురు, రాజమండ్రి నుంచి 20 మంది, మండపేట, సామర్లకోట నుంచి ఒక్కరుగా ఢిల్లీకి వెళ్లినట్టుగా  పోలీసులు గుర్తించారు. మొత్తం 26 మందిని ఇప్పుడు క్వారంటైన్ కి తరలించారు. వీరిలో ఒక వృద్ధుడు కి పరీక్షలో నెగిటివ్ వచ్చినా గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 


రాజమండ్రి కి చెందిన వారికి ఒకరికి కాకినాడకు చెందినవారిలో ఒకరికి పాజిటివ్ గా తేలింది. అయితే ఇంకా మిగిలిన వారి వివరాలు బయటకి రావాల్సి ఉంది. 
ఈ విషయం బయటకి పొక్కడంతో జిల్లావాసుల్లో ఎక్కడలేని ఆందోళన కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. గ్రామ వాలంటీర్ల ద్వారా మరోసారి ఢిల్లీ బృందాలతో సన్నిహితంగా తిరిగిన వారిని గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నం అయ్యింది. ఇక పశ్చిమగోదావరి జిల్లాలోనూ పెద్ద సంఖ్యలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు పెద్ద సంఖ్యలో ఉండడం, వారికి కరోనా పాజిటివ్ అని తేలడం ఇక్కడా కలకలం రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: