కరోనా పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి అనడంలో అతిశయోక్తిలేదు. రాను రాను పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికే విపరీతమైన ప్రాణ , ఆర్ధిక నష్టాలతో ప్రపంచం కుదేలుమంటోంది... ఇక కరోనా వైరస్ నిర్ములనకు   ఇప్పటివరకు వ్యాక్సిన్ లభించిన దాఖలాలు లేవు. ఇక అంతర్జాలంలో ఏవేవో వార్తలొచ్చినా... అవన్నీ, వట్టి బూటకపు మాటలే.

 

ప్రస్తుతానికి విశ్వ వ్యాప్తంగా 170 దేశాలకు పైనే ఈ వైరస్ ప్రబలినట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా 8.72లక్షల కరోనా వైరస్ కేసులు నమోదు కాగా... 47 వేల మందికి పైగా తనువులు చాలించారు. ఇలాంటి సంక్షోభంలో కూడా ఇప్పటివరకు ఏ ఒక్క కేసు కూడా నమోదు కాని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అవి ఏమిటంటే... ఉత్తర ఫసిపిక్ లోని పలావు ద్వీపం, తూర్పు ఆసియా ప్రాంతం, సమోవా, తుర్క్మెనిస్తాన్, ఉత్తరకొరియా, అంటార్కిటికా ప్రాంతాలు, ఆఫ్రికాలో బోట్స్ వానా , ల్యాండ్ లాక్ లెసో ప్రాంతాలుగా గుర్తించారు.

 

కొత్తగా నమోదైన మన ఆంధ్ర రాష్ట్రంలోని కేసుల్ని ఒకసారి చూసుకుంటే.... అత్యధికంగా కడపలో 15 కేసులు, వెస్ట్ గోదావరిలో 13 కేసులు, చిత్తూరులో 5, ప్రకాశం 4, నెల్లూరు 2, తూర్పు గోదావరిలో 2, కృష్ణా 1, విశాఖ 1 కేసు.. మొత్తంగా నేడు ఒక్కరోజే 43 కేసులతో కలిపి.. సంఖ్య 87కి చేరింది... దాంతో మన రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు... ఢిల్లీ ముస్లిం సభలకు వెళ్లిన వారి వివరాలపైన ఆరా తీస్తున్నారు.

 

ప్రపంచలో మొత్తం కేసులు: 8, 73 , 008
మరణాలు: 43, 289
రికవరీ కేసులు: 1, 84, 937

 

ఇండియాలో మొత్తం కేసులు: 1590 
మరణాలు: 45 
కొత్త కేసులు: 193
రికవరీ కేసులు: 148 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 97
మృతులు: 6 
ఏపీలో మొత్తం కేసులు: 87
మృతులు: 0

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: